Ap cm chandrababu naidu strong decision on ap capital city vijayawada

chandrababu naidu, ap cm chandrababu naidu, ap capital city, ap capital city vijayawada, vijayawada city, andhra pradesh government, tdp government, tdp party ministers, ap finance minister yanamala ramakrishna, ap cabinet ministers

ap cm chandrababu naidu strong decision on ap capital city vijayawada

ఏపీ రాజధాని విషయంలో మొండికేసుకున్నచంద్రబాబు..!

Posted: 09/03/2014 10:09 AM IST
Ap cm chandrababu naidu strong decision on ap capital city vijayawada

(Image source from: ap cm chandrababu naidu strong decision on ap capital city vijayawada)

ఏపీ రాజధాని విషయంలో రానురాను చర్చలు రసవత్తరంగా మారిపోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం దాదాపు 3 నెలలు కావస్తున్న ఇంకా రాజధాని తేలకపోవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం అసెంబ్లీలో ఏపీ కొత్త రాజధానిని ప్రకటనను వాయిదా వేసి.. దీనిని మరింత చర్చనీయాంశంగా మార్చేశారు. అయితే ఆరోజు తిథి అష్తమిరోజు కావడంతో తన ప్రకటటను వాయిదా వేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏదైతేనేం.. చంద్రబాబు రాజధాని విషయంలో మొండికేసుకున్నారని రాజకీయరంగంలో చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలావుండగా.. ఏపీ రాజధాని ఫైనల్ గా విజయవాడేనంటూ తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటివరకు రాజధాని నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ భూములు కృష్ణా జిల్లాలో అందుబాటులో లేవని ప్రచారం చేసుకుంటే.. తాజాగా ఆ వ్యాఖ్యానాన్ని ఖండిస్తూ రాజధానికోసం అవరమైనదానికంటే అధికంగానే ప్రభుత్వ భూములు వున్నాయంటూ రెండురోజులుగా వార్తాకథనాలు వెలువడుతున్నాయి. పైగా రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వాదనలనే వినిపిస్తున్నారు. దీంతో విజయవాడలోనే రాజధాని ఏర్పాటు కానుందన్న నిశ్చితాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కూడా ఈ విషయంపై నోరు మెదపకపోవడంతో విజయవాడే రాజధాని అన్న వాదనను మరింత బలపరుస్తున్నాయి.

అంతేకాదు.. విభజన జరిగినప్పటికీ నుంచి సీఎం చంద్రబాబు కూడా విజయవాడనే రాజధానిగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే.. ఆ ప్రాంతం ముందునుంచే దాదాపుగా బాగా అభివృద్ధి చెందింది. పైగా గుంటూరు కూడా చాలా దగ్గరలోనే వుండటంతో సంయుక్తంగా వాటిని మరింతగా అభివృద్ధి చాలా తక్కువ సమయంలోనే చేయొచ్చుననే ఆశాభావంతోనే బాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లోవైపు కేంద్రం మొగ్గుచూపుతున్నప్పటికీ.. బాబు మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా.. విజయవాడనే రాజధానిగా రూపుదిద్దాలనే భావనతో చంద్రబాబు ఈ విషయంలో మొండికేసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

అటు.. మంగళవారం తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆర్థికమంత్రి యనమల మాట్లాడుతూ.. రాజధాని నిర్ణయంపై తమ కేబినెట్ లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. దీంతో నిన్నటిదాకా వినిపించిన భిన్నవాదనలకు ఇక తెరపడినట్లేనని వార్తలు వస్తున్నాయి. రాజధాని విషయంపై సీఎం ప్రకటించనున్న తరుణంలో కేబినెట్ సహచరుల మధ్య భేదాభిప్రాయాలు వుండకూడదన్న భావనతోనే సీనియర్ మంత్రులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. గురువారం సీఎం ప్రకటనలో రాజధాని విషయంపై సాగుతున్న చర్చలకు తెరపడినట్లేనని మెజార్టీ చర్చలు భావిస్తున్నాయి. చంద్రబాబు ముందుగా ప్రకటించినట్లుగానే విజయవాడనే ఏపీ రాజధానిగా పక్కాగా రూపుదిద్దుకోవడం ఖాయమని తెలుస్తోంది.

మరోవైపు.. కర్నూలు ప్రాంతాన్ని రాజధానిగా మార్చాలంటూ అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బాబు వాటిని పట్టించుకోకుండా విజయవాడ దిశగా అడుగులు వేయడం అక్కడి ప్రజలకు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. 1956కు ముందు కర్నూలు ప్రాంతమే రాజధానిగా వుండేదని.. అయితే అప్పట్లో రాష్ట్రాన్ని కలపడం వల్ల అది హైదరాబాద్ కు తరలివెళ్లిందని వాదనలను వినిపిస్తున్న వారు.. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి తిరిగి కర్నూలునే రాజధాని చేయాలంటూ పట్టుబడుతున్నారు. మరి ఈ విషయంపై బాబు ఎలా స్పందించనున్నారో.. ఎలా వ్యవహరించనున్నారో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city  vijayawada  ap assembly  yanamala ramakrishna  

Other Articles