Kapu s will get bc status soon

kapu bill, kapu bc bill, kapu caste, latest news, chandrababu naidu, chowdary, bc bill, oc, castes in andhrapradesh, telangana, reservations, sc, st, bc, obc, assembly

soon kapu bill will introduced in assembly says ap cm chandrababu naidu : ap cm chandrababu naidu announce in assembly that kapu reservation bill will introduced soon

త్వరలో కాపు రిజర్వేషన్ బిల్లు-చంద్రబాబు

Posted: 09/04/2014 04:35 PM IST
Kapu s will get bc status soon

కాపులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే కాపులను బీసీలుగా గుర్తిస్తూ త్వరలోనే చట్టం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో గురువారం ఈ ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా కాపులను బీసీలుగా గుర్తించే బిల్లును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఏళ్ళుగా నానుతున్న ఈ డిమాండ్ కు బాబు మార్గం చూపటం పట్ల కాపు సామాజికవర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. అగ్రవర్ణం పేరుతో ఇంతకాలం అందకుండా ఉన్న రిజర్వేషన్లు త్వరలోనే కాపులకు దక్కనున్నాయి.

ఏళ్ళుగా నానుతున్న కాపుబిల్లు

కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉంది. దీనిపై ఎన్నో ఉద్యమాలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాపు బీసీ బిల్లు కోసం దీక్షలు చేశారు. ఈ పోరాటానికి రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు మద్దతిచ్చారు. అయితే ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతా పక్కనబెడుతూ వచ్చారు. కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు వారి అభివృద్ధిపై మాత్రం చిత్తశుద్ధిని చూపలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగానే ఈ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. కాని అమలు చేయటంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా అంశాన్ని పట్టించుకోకుండా నానుస్తూ వచ్చాయి. దీనికి తోడు విభజన ఉద్యమం, సమైక్య ఉద్యమం తీవ్రంగా నడవటంతో ఈ ప్రభావం కూడా బిల్లుపై పడింది.

ఎట్టకేలకు బాలారిష్టాలు దాటుకుని ఉద్యమాల స్థాయి నుంచి.., అసెంబ్లీలో ప్రకటన ముఖ్యమంత్రిచే చేయించుకునేవరకు విజయం సాధించారు. ఇక బిల్లు ఆమోదం పొంది.., రిజర్వేషన్ ఫలాలు కాపులకు అందితే వారి సామాజిక వర్గ సమగ్ర అభివృద్ధి త్వరలోనే సాద్యమని విశ్లేషకులు అంటున్నారు. అగ్ర వర్ణం పేరుతో పేదరికంలో మగ్గుతున్న ఎన్నో కుటుంబాల్లో బాబు నిర్ణయంతో వెలుగులు నిండుతాయని భావిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu bc bill  chandrababu naidu  assembly  latest news  

Other Articles