Students cut junior wrist for keeping watch

wrist watches, new watches, wall clocks, branded watches, tamil nadu, caste discrimination, caste system, upper castes, lower castes, courts, reservations, jayalalita, tamilnadu, sivakasi, sc, st, bc, obc, oc, latest news, reservations

students of upper caste in tamilnadu cut a student of lower caste wrist : upper caste students on hunt by police for cutting student hand

వాచి పెట్టుకొస్తే విద్యార్థి చేయి కోసేశారు

Posted: 09/05/2014 09:35 AM IST
Students cut junior wrist for keeping watch

అగ్రవర్ణం ఆదిపత్యం, జాత్యహంకారం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్ళుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ సామాజిక దుష్పరిణామాలు ఈ తరం విద్యార్థులకు విషంలా ఎక్కుతున్నాయి. పాఠశాల స్థాయిలో కూడా కుల మహమ్మారి విజృంభించి వివక్షకు దారి తీస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ దళిత విద్యార్థి చేతికి గడియారం పెట్టుకొస్తే అతడి మణికట్టును అగ్రవర్ణ విద్యార్థులు కోసేశారు. విరుద్ నగర్ జిల్లా శివకాశిలో రమేష్ అనే విద్యార్థి స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఓ రోజు స్కూలుకు వాచి పెట్టుకొచ్చాడు. ఈ విషయం అగ్రవర్ణ విద్యార్థుల దృష్టికి వచ్చింది.

 

రమేష్ చేతికి వాచి పెట్టుకోవాటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బలవంతంగా వాచి తీయించివేశారు. అయితే రమేష్ వారిపై తిరగబడ్డాడు.., దీంతో స్కూల్ లో కొద్దిసేపు గొడవ జరిగింది. ఆ తర్వాత రెండ్రోజులకు రమేష్ ఓ పనిమీద బయటకు వెళ్ళగా తిరుత్తణళ్ళూరు రైల్వే స్టేషన్ సమీపంలో అగ్రవర్ణ విద్యార్థులు అడ్డుకున్నారు. తమనే ఎదిరిస్తావా అంటూ సుమారు పదిహేను మంది విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత వాచి పెట్టుకొచ్చిన చేయి మణికట్టును కోసేశారు. తీవ్ర గాయాలతో వారి నుంచి తప్పించుకుని ఓ ఆస్పత్రిలో చేరి ప్రాధమిక చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత శివకాశి ప్రభుత్వ హాస్పిటల్లో చేరాడు.

 

ఘటన బయటకు తెలియటంతో దళిత సామాజికవర్గ నేతలు ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్పందించిన పోలిసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. మిగతా విద్యార్థుల కోసం గాలింపు మొదలు పెట్టారు. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నట్లు తిరుత్తణళ్ళూరు పోలిసులు వెల్లడించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wrist cut  watches  tamilnadu  latest news  

Other Articles