కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా. ఆమె మాట్లాడితే అలా నిలుచుండిపోవాల్సిందే. అంతటి వాక్చాతుర్యం.., వాక్ధాటి ఉన్న మహిళా నేత ఆమె. ఉన్నట్టుండి ఆమెకు పుట్టింటిపై ప్రేమ పొంగుకొచ్చింది. అదేనండి ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే రేణుకకు జిల్లాలో ముంపు మండలాలపై స్పందించింది. విలీనంకు కేంద్రం ఆమోదం తెలిపి.., విభజన చట్టాన్ని సవరించిన ఇన్నాళ్లకు ఆమె ఉద్యమం మొదలు పెట్టింది. ఇన్నాళ్లు కన్పించని ఖమ్మం కూతురుకు సడన్ ఇంత ప్రేమ వచ్చిందేమిటా అని చర్చ జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం.... 7ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపి విభజన చట్టాన్ని కూడా సవరించింది. సవరణ సమయంలో పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ప్రతిఘటించారు. అటు ముంపు మండలాల ప్రజలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. కాని నిర్ణయం ఆగలేదు. మండలాలను విలీనం చేస్తూ ఉత్తర్వులు కూడా ఎప్పుడో వెలువడ్డాయి. ఇంత జరిగిన తర్వాత ఇన్ని రోజులకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు కొంతమంది ముంపు గ్రామాల ప్రజలు భద్రాచలంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. పోలవరం కింద ముంపు లేదని.., అయినా సరే అన్యాయంగా మండలాలను ఏపీలోకి చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
అటు ముంపు గ్రామాల విలీనంకు కేసీఆర్ కారణమని కొత్తగా ఆరోపించారు. దీనిపై అంతా అవాక్కయ్యారు. కేసీఆర్ కేంద్రంతో చర్చించి మండలాలను ఏపీకి అప్పగించారా అని గిరిజన ప్రజలు అనుకుంటున్నారు. అయితే విభజన చట్టంలోనే ముంపు మండలాలను ఏపీలో కలపాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో సొంత ప్రభుత్వం బిల్లును ఆమోదించేటపుడు రేణుక సైలెంట్ గా ఉంది. పుట్టింటికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక అయ్యో అన్యాయం జరిగిపోయిందని గిరిజనులను ఓదారుస్తోంది.., వారి పక్షాన నిలిచి ట్రాక్టర్ నడిపి మరీ పోరాటం చేస్తోంది. అదీ రేణుక అక్క అంటే.., ఆమె ఏది చేసినా ఎరైటీ అని లోకల్ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more