Ration rice lorries seized gif

kidney, human body, kidney failure, sugar, operation, disease, hospitals, kidney exchange, organs donation, latest news, delhi, family, husband, wife, blood, relations

two wives mutually exchanged kidney for their kidneys : in delhi two husbands replaced by both wives exchanging kidneys mutually

భర్తల కోసం కిడ్నీలు మార్చుకున్న భార్యలు

Posted: 09/08/2014 09:01 AM IST
Ration rice lorries seized gif

దాంపత్య బంధం విలువలు రోజురోజుకూ పతనమవుతున్న ఈ రోజుల్లో భర్తల కోసం తమ అవయవాలను మార్చుకుని పవిత్ర బంధానికి ప్రతీకలుగా నిలిచారు ఇద్దరు భార్యలు. తమ భర్తల కోసం పరస్పరం కిడ్నీలు మార్చుకుని రెండు జీవితాలను నిలబెట్టారు. బొకోరాకు చెందిన ఎస్.బి.రాం సెయిల్ లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు మూత్రపిండాలు పాడయ్యాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉండటంతో ఈ ప్రభావం ఎక్కువగా పడింది. మూడేళ్ళుగా డయాలసిస్ పై ఉన్నారు.

ఢిల్లీలోని ఎన్.డీ.ఎం.సీ.లో ఉన్నతాధికారిగా ఉన్న సంత్ రాం కూడా షుగర్, మూత్రపిండాలు పాడయి బాధపడుతున్నాడు. దీంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గింది. ఎస్.బీ.రాం., సంత్ రాం ఇద్దరూ ఒకేరకమైన వ్యాధితో బాధపడుతుండటంతో ఇద్దరూ ఆస్పత్రుల చుట్టూ తిరగటానికే సమయం సరిపోయేది. అనుకోకుండా ఒకరోజున ఇద్దరి భార్యల కిడ్నీలు భర్తలకు ఉపయోగపడతాయా అని డాక్టర్లు పరీక్షించారు. ఫలితం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఒకరి భార్య కిడ్నీ మరొకరికి నూటికి నూరుపాళ్లు సరిపోయే విధంగా ఉంది. ఇలా పరస్పరం ఇద్దరు భార్యల కిడ్నీలు ఇద్దరు భర్తలకు సరిపోయేలా ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కిడ్నీ మార్పిడి విషయం భార్యలకు చెప్పగా.., తమ భర్తలు బ్రతుకుతాడంటే అంతకంటే ఏం కావాలి అనుకుని ఇద్దరూ కిడ్నీలు మార్చుకోవటానికి అంగీకరించారు. దీంతో ఒకరి భర్తకు మరొకరు కిడ్నీ దానం చేసుకున్నారు. అవయవ దానాల ద్వారా ఇద్దరూ తమ భర్తలను దక్కించుకున్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidney exchange  operation  delhi  latest news  

Other Articles