Chandrababu asks rs 1 lac crore for ap capital

Chandrababu, Yv Rao, 14 finance commission, new capital, Rs 1 lac crore

Chandrababu attends to 14 finance commission meeting, asks 1 lac crore rupees for building up of new capital.

రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు

Posted: 09/12/2014 04:01 PM IST
Chandrababu asks rs 1 lac crore for ap capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్థిక సంఘానికి విన్నవించారు. దేశంలో ఇతర రాజధానులకు ధీటుగా తాము రాజధానిని నిర్మించదలిచామని చెప్పారు. ఏపీ కోత్త రాజధాని ప్రపంచపటంలో స్థానాన్ని సాధించేలా నిర్మాణం చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతోందన్నారు. తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి  1,00, 213 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అధికారుల పంపిణీ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. సంక్షోభాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటామన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. అయిదు లేదా ఏడేళ్లలో ఏపీలో పూర్తిస్థాయి అక్షరాశ్యత సాధిస్తామన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు.  రాష్ట్ర విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు ఆర్థిక సంఘానికి వివరించారు.

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుహృద్భావంతో కేటాయింపులు జరిపి, ఆర్థికసాయం అందిస్తామని 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్ వైవీ రెడ్డి తెలిపారు. తిరుపతిలో 14 అర్థిక సంఘం సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై సభ్యులతో చర్చించి కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Yv Rao  14 finance commission  new capital  Rs 1 lac crore  

Other Articles