Rape case filed against ncp mla

rape case, ncp mla, laxmanrao dhobale, Sholapur, Bhoriwali

Rape case filed against Sholapur NCP Mla Lashman Rao dhobale.

రేప్ కేసులో ఎన్సీపీ ఎమ్మెల్యే

Posted: 09/13/2014 02:59 PM IST
Rape case filed against ncp mla

కంచె చేను మేసిన చందంగా.. ఆ ఎమ్మెల్యకు వున్న వంకర బుద్ది, వెకిలి చేష్టలు ఆయనపై రేప్ కేసు నమోదయ్యేలా చేశాయి. మాజీ అమాత్యులు ( మంత్రి)గా పనిచేసిన ఈయనకు అమ్మాయిలంటే భలే మోజు. ఆ మోజే ఆయనకు మంత్రి పదవిని దూరం చేసిందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తితోనే తనకు కష్టాలు వచ్చాయని ఓ బాధితురాలు తన అవేదనను వెల్లబోసుకుంది. చంపేస్తామన్న బెదిరింపులను కూడా లక్ష్యపెట్టకుండా ఎట్టకేలకు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది.

ఇంతకీ ఎవరా ఘనుడు అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యే లక్ష్మణరావు ధబోలే. బాధితురాలి పిర్యాదు మేరకు దబోలేపై బోరివాలి పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 323 (గాయపరచడం), 506 (బెదిరించడం) కింద బోరివాలి పోలిస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు డీసీపీ బల్సింగ్ రాజ్పుత్ తెలిపారు.

కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న తనను దబోలే చాలా కాలం నుంచి వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనకు అత్యంత సన్నిహుతులైన వారి కాలేజ్ కావడంతో ఉద్యోగం ఉండాలంటే తన మాట వినాల్సిందేనని బెదిరించాడని కూడా బాధితురలు తెలిపింది. కాళాశాలలో మీగింట్ పేరుతో తనను రప్పించి.. అత్యాచారం చేశాడని తన గోడును వెళ్లబోసుకుంది. ఎంత వేడుకున్నా తన మాట పెడ చెవిన పెట్టిన ఆయన పదే పదే పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. తనను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని, తమ ఇంటి ఎదుట పోస్టర్లు వేయిస్తానని భయపెట్టాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. గతంలో మహారాష్ట్రకు మంత్రిగా కూడా పనిచేసిన ధబోలే.. ఈ అత్యాచారాల గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించారని పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape case  ncp mla  laxmanrao dhobale  

Other Articles