Students academic year in dolldrums

Telangana government, Andra Pradesh government, Chandrababu, KCR, Supreme court, students

AP, TS governments differs with decessions. students academic year in dolldrums

పెద్దల పంతం .. విద్యార్థుల భవితకు ‘గ్రహణం’...

Posted: 09/13/2014 05:32 PM IST
Students academic year in dolldrums

ఆ రెండు తెలుగు రాష్ట్రాలే.. ఇరు ప్రాంతాల వారు మాట్లాడేది తెలుగే. అయినా ఒకరంటే మరోకరికి పడదు. ఎదుటి వాడు ఎదిగినా పర్వాలేదు కానీ, మన పక్కవాడు అస్సలు ఎదగొద్దని కుట్రలు. అయినా ఎదిగాడా.. కాలు లాగేయడాలు.. ఇవ్వన్ని వింటుంటే చిన్నపిల్లల చేష్టలు మాదిరిగానే వున్న అదే నిజమైంది. పంతాలు నెగ్గించుకోవడం కోసం తొందరపాటు చేసే పనులు ఫలితాలను ఇవ్వవని పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలకు ఇది గుణపాఠం. సమైక్య రాష్ట్రంగా సుమారుగా ఆరు దశాబ్దాలు కలసివున్న రాష్ట్రాలు విడిపోవడంతోనే బద్ద శత్రువులుగా మారాలా..? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలా..?

రెండు రాష్ట్రాల మధ్య నెలకోన్న వివాదాలను ఇద్దరు ప్రభుత్వాధి నేతలు సమన్వయంతో కూర్చోని పరిష్కరించుకుంటే చిక్కులే వుండవు. ఇది నిరూపితమైన తరువాత కూడా పంతాలకు పోయి.. పాపం విద్యార్థలు భవిష్యత్తుతో అడుకోవడం ఎవరికి మంచిది కాదు. పెద్దల పంతాకు విద్యార్థుల తమ అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది శాపంగా పరిణమించింది. ఎవరి వల్ల ఎవరికి లాభం చేకూరినా పర్వ లేదు.. కానీ ఒకరు వల్ల మరోకరు నష్టపోవాల్సి వస్తే..? ఇప్పుడదే జరిగింది.

ఆగస్టు 31 ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ పూర్తి చేయలేమని తమకు అక్టోబర్‌ వరకు గడువు కావాలని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించినా.. ఆ లోపు చేయవచ్చని వాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పింది. దీంతో తక్షణం కౌన్సిలింగ్ చేపట్టాలని సుప్రీం ఆదేశాలను జారీ చేసింది. దీంతో దాదాపు 65వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తులో చీకట్లు అలుముకున్నాయి. నిర్ణీత గడువులోపు కౌన్సిలింగ్‌ పూర్తి చేయకుండా రెండో విడత కౌన్సిలింగ్‌కు సమయం కావాలని కోరిన ఏపీ ఉన్నత విద్యామండలి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సిలింగ్‌లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు లభించాయని, మరో 65 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటితో పాటు బీ కేటగిరీ సీట్లలో కూడా కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం త్రోసిపుచ్చింది.

సకాలంలో కౌన్సిలింగ్‌ ఎందుకు నిర్వహించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది? రెండో విడత కౌన్సిలింగ్‌కు సమయం అవసరమని ముందే ఎందుకు చెప్పలేదని నిలదీసింది? ఆస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 1 వరకు తరగతులు ప్రారంభిస్తామని అప్పుడెలా వాదించారు..? ఇప్పుడు అదనపు గడువు అడుగడమెందుకని ప్రశ్నించింది? అప్పటికీ ఖాళీలు వుంటే మరోమారు సమయం అడగరని గ్యారంటీ ఉందా? ఖాళీలు ఉంటే ఉండనివ్వండంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతేకాదు ఉన్నత విద్యామండలి తరపు న్యాయవాది విశ్వనాథన్ ను తీవ్రంగా మందలించింది. గడువులోపు అడ్మిషన్లు పూర్తి చేయనందుకు చర్యలు తీసుకోవాలి. కానీ వదిలేస్తున్నామని తేల్చి చెప్పింది. పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినా ప్రతి వ్యాఖ్యంలో నిగూఢ అర్థముంది. ఇద్దరు కలసి ఐక్యంగా వ్యవహారాలను పూర్తి చేసి వుంటే ఈ పరిస్థతి వచ్చేది కాదు. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందులకు గురి చేసి తాను పైచేయి సాధించాననుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది తొలి ఎదురుదెబ్బేనని చెప్పాలి.

నిత్యం గెలిచే అదృష్టవంతులు కొందరే వుంటారు. ఎప్పడు విజయం మాదేనని భ్రమల్లో వుండే వారికి అవి తోలగిపోయే రోజు ఎంతో దూరంలో వుండదు. కానీ గెలుపోటములు సహజం. అగస్టులో గెలిచాం, సెప్టెంబర్ లోనూ గెలుస్తామనుకుంటే పోరబాటేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థమైంది. ప్రభుత్వ తప్పిదాల వల్ల ఎంసెట్‌ ప్రవేశాల చరిత్రలోనే తొలిసారిగా తొలివిడత కౌన్సిలింగ్‌లోనే సీట్లు భర్తీ నిలిచిపోయింది. సీటు రాకుండా మరో అవకాశం కోసం చూస్తున్న వారికి, ఒక కోర్సు నుంచి మరో కోర్సు మారాలనుకున్నవారికి, ఒక కళాశాల నచ్చకుండా మరో కళాశాలకు మారాలనుకున్నవారికి, తొలివిడత సీటు వచ్చినా మరరో విడత సీటుకోసం ఎదురు చూస్తున్నవారికి సుప్రీంకోర్టు తీర్పు వల్ల తీవ్ర నష్టం జరిగింది.

దీనితో విద్యార్థుల భవితవ్యంతో చంద్రబాబు సర్కార్‌ చెలగాటమాడినట్లైంది. దేశంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తామే ఆంధ్ర ప్రజలను రక్షిస్తున్నట్లు ప్రచారం చేసుకునే  చంద్రబాబు.. తమ విద్యార్థుల ఏడాది భవిష్యత్తుకు గ్రహణంగా తయారయ్యాడు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు వారి ప్రజల సంక్షేమం కోసం కలసి పనిచేయాలని ఆశిద్దాం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  KCR  Supreme court  Engineering students  

Other Articles