24 hrs continuous power in ap

24 hrs power, ap government, chandrababu, 2018-19, central government, Mou

24 hrs continuous power in ap by 2018-19, centre and ap government to sign Mou

చీకటి ఎరుగని దక్షిణాది రాష్ట్రం

Posted: 09/15/2014 04:09 PM IST
24 hrs continuous power in ap

చీకటే ఎరుగని (తెలయని) దక్షణాది రాష్ట్రం వుందా..? అంటే అతిశయోక్తే నంటారా..? అవును ఈ రోజు వరకు అతి అతిశయోక్తి కావచ్చు.. కానీ రేపటి నుంచి అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది కాబట్టి. ఎక్కడనేగా మీ సందేహం. ఆంద్రప్రదేశ్ లోనేనంటే..  నమ్మలేని నిజం  అంటారా..? అవునండి ఇది నిజమే. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో తిమిరాలు దూరంకానున్నాయి. పండు వెన్నెల కాంతులీననున్నాయి. సెప్టెంబర్ 16న చంద్రబాబు వంద రోజుల పాలన పూర్తి కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలను చేసుకోనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా కేంద్ర విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తోపాటు కేంద్ర విద్యుత్‌శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టీపీసీ) సీఎండీ అరుప్ రాయ్ చౌదరి, కేంద్ర సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర నిమ్జే, కేంద్రానికి చెందిన ఇంధన పొదుపు సొసైటీ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్‌కుమార్ హైదరాబాద్ రానున్నారు.

అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంటలో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ పార్కు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీపీసీ మధ్య ఎంఓయూ కుదురుతుంది. ఏపీ జెన్‌కో, నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌కాప్), ఎస్ఈసీఐ మధ్య 1,500 మెగావాట్ల అల్ట్రా మెగా సౌరవిద్యుత్ పార్కుల ఏర్పాటుకు మరో ఒప్పందం కుదుర్చుకోనుంది. గృహ, వ్యవసాయ రంగాల్లో విద్యుత్ పొదుపుతోపాటు పురపాలక సంఘాల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు చేసే కార్యక్రమంపై మూడో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఈ మూడు ఒప్పందాలపై సంతకాలన్నీ కూడా కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కూడా వీరి వెంట ఉంటారు.

ఈ సందర్భంగానే విశాఖ జిల్లాలోని పుడిమడకలో ఎన్టీపీసీకి 1,200 ఎకరాలను కేటాయించిన పత్రాలను ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆ సంస్థకు అందించనున్నారు. ఇక్కడ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. ఎన్టీపీసీ ఏర్పాటు చేసే సౌర విద్యుత్ పార్కుకు రూ.200 కోట్లు ఇవ్వడానికి ఎస్ఈసీఐ ఇప్పటికే అంగీకారం తెలిపింది.ని తెలిపారు. సంప్రదాయేతర ఇంధనవనరుల ద్వారానే 9,150 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుని.. 2018-19నాటికల్లా నిరంతరాయ విద్యుత్ ను ప్రజలకు అందించాలని ఏపీ సర్కార్ ఉరకలు వేస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 24 hrs power  ap government  chandrababu  2018-19  central government  Mou  

Other Articles