Maoist party of telangana condemns kcr comments on media

kcr, telangana, k.chandrashekar rao, telangana government, andhrajyothy, abn, ban on abn, tv9 ban on tv9, kcr comments on media, kcr comments, kcr funny, maoists, maoist party, naxalites, naxals, police encounter, naxal encounter, maoist attack, latest news

maoists of telangana condemned kcr comments and government behaviour respoding about ban on tv9 and abn andhrajyothy : maoist leader jagan released a letter by supporting tv9 and abn andhrajyothy also condemns kcr comments on media

మీడియాకు మావోల మద్దతు.. కేసీఆర్ కు షాక్

Posted: 09/17/2014 03:23 PM IST
Maoist party of telangana condemns kcr comments on media

మీడియాను పాతరేస్తామంటూ సంచలన ప్రకటనలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రిపై వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. ఇప్పటివరకు మీడియా పెద్దలు ఈ మాటలను ఖండించగా.., తాజాగా మావోయిస్టులు కూడా ఉద్యమ పెద్దను తప్పుబట్టారు. మీడియాపై తెలంగాణ ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యాఖ్యలు చేయటం సరికాదని తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ర్ట కమిటీ అధికార ప్రతినిది జగన్ అన్నారు. ఆయన పేరుతో విడుదలైన లేఖలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేసీఆర్ నియంతలా చానెళ్లను నిషేదిస్తామని.., తొక్కేస్తామనటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు.

నిషేదం వెనక కేసీఆర్ హస్తం

అటు ఏబీఎన్, టీవీ9 చానెళ్లను నిషేధించటం వెనక కేసీఆర్ హస్తముందని జగన్ ఆరోపించారు. ఎం.ఎస్.ఓ.ల వెనక కేసీఆర్ ఉండి నిషేధం కొనసాగించేలా చేస్తున్నారని ఆరోపించారు. నియంతలా, నిషేధాలు కొనసాగించటం సరికాదని మండిపడ్డారు. ఏబీఎన్, టీవీ9 చానెళ్లు అసత్యాలు, ఇబ్బందికర వార్తలు ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప.., ఏకపక్షంగా మీడియా గొంతు నొక్కటం ఏంటని జగన్ ప్రశ్నించారు. మీడియాను పది కిలోమీటర్ల లోతున పాతరేస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించాయి. కేసీఆర్ మాటలపై జాతీయ మీడియాలో కూడా ప్రధాన కధనాలు ప్రసారం అయ్యాయి. జాతీయ స్థాయిలో మీడియా ప్రతినిధులు కేసీఆర్ మాటలను ఖండించారు.

అటు ఇదే అంశంపై  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్ఖండేయ ఖట్జూ అభ్యంతరం తెలిపారు. మీడియాను తొక్కేయటం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఈ కమిటీ పర్యటించి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ సందర్బంగా కేసీఆర్ మాటలపై పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు చానెళ్ల నిషేధంపై స్పందించి ప్రసారాల పునరుద్దరణకు చర్యలు తీసుకోవటం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maosts  ban on tv9 and abn  kcr  media  

Other Articles