Indian prime minister narendra modi press meet after meeting with china prime minister xi jinping

narendra modi, indian prime minister narendra modi news, china prime minister xi jingping, narendra modi xijingping, narendra modi press meet, china pm xi jingping press meet

indian prime minister narendra modi press meet after meeting with china prime minister Xi jinping

చైనా ప్రధానితో మోడీ షేక్ హ్యాండ్! ఒప్పందాలు ఇవే!

Posted: 09/18/2014 08:00 PM IST
Indian prime minister narendra modi press meet after meeting with china prime minister xi jinping

(Image source from: indian prime minister narendra modi press meet after meeting with china prime minister Xi jinping)

భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నరేంద్రమోడీ వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే! అలాగే ప్రపంచదేశ ప్రధానమంత్రులతో భేటీ అయి, వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయన చాలామంది దేశ ప్రధానులతో భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా చైనా ప్రధాని జి.జిన్ పింగ్ తో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న పోరాటనేపథ్యంలో ఈ విధంగా ఈ ఇద్దరు ప్రధానమంత్రులు కలుసుకోవడం చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఈ భేటీ అనంతరం రెండు దేశాల మధ్య వున్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయా..? లేదా..? అన్న సందేహాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అసలు ఈ భేటీలో వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు..? అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇదిలావుండగా.. చైనా ప్రధానితో సమావేశం అయిన అనంతరం మోడీ మీడియాతో తమ మధ్య జరిగిన సంభాషణల గురించి మాట్లాడారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుగా వుందని చెప్పిన ఆయన... చైనాతో సంబంధాలు గొప్ప అవకాశంగా మలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చైనా - భారత్ సంబంధాలపై కీలక చర్చలు జరిపినట్లు ఆయన అన్నారు. అమ్మకాలు పెట్టుబడులపై భారత కంపెనీలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు మోదీ తెలిపారు. భారత్‌లో రెండు ఇండస్ట్రియల్‌ పార్కుల నిర్మాణానికి చైనా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. సంబంధాలతో పాటు అన్ని విషయాలు సమగ్రంగా చర్చించామని మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక, దృశ్య శ్రవణ మాద్యమం, రైల్వే, సాంస్కృతిక, అంతరిక్షం, పాలన, పన్నులు, నాదుల మీదుగా మానవ సరోవరంకు రోడ్డు నిర్మాణం, షాంఘై-ముంబై నగరాల అభివృద్ధి తదితర వాటిపై ఒప్పంద సంతకాలు జరిగినట్లు మోదీ చెప్పారు. దీంతోపాటు వాణిజ్య, వ్యాపారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఐదేళ్ల పాటు ఒప్పందం కుదరడం గొప్ప ముందడుగు అన్నారు. అయితే.. పౌర - అణు ఒప్పందం పైన ముందుముందు చర్చలు జరుపుతామన్నారు.

ఇక చైనా - భారత్ సరిహద్దులో వున్న ఉద్రిక్తల పై చైనా అధ్యక్షుని ముందు తాను ఆందోళన వ్యక్తం చేశానని నరేంద్ర మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య వాస్తవాధీన రేఖ పైన చాలాకాలంగా చర్చలు నిలిచిపోయాయని, సరిహద్దు వద్ద ఉద్రిక్తత తగ్గించుకోవాల్సి ఉందన్నారు. ఇకనుంచి సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తాను జిన్‌ పింగ్‌ను కోరినట్లు మోదీ తెలిపారు. సాంస్కృతిక, సామాజికంగా ఇప్పుడు నాగరికత ఎంతో పరిణితి సాధించిందన్నారు. గత రెండు రోజులుగా ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం లభించిందని మోదీ చెప్పారు. ఇరు దేశాల నిరంతర శిఖరాగ్ర సమావేశాలకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇరుదేశాల కలయికతో భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఆస్కారం వుందని చెప్పిన ఆయన... రెండుదేశాల మధ్య వున్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సమసిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరి, దీనిపై ఆయన రిప్లై ఏమిచ్చారోనన్న విషయం మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందాలు సక్సెస్ అయితే.. భారత్ త్వరలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలే వుంటాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  china prime minister xi jingping  narendra modi xi jingping  

Other Articles