Finnaly doctors and scientists found vaccine to avoid ebola virus

ebola virus, ebola virus vaccine, ebola virus latest news, doctors and scientists ebola virus, ebola virus patients, africa residence

finnaly doctors and scientists found vaccine to avoid ebola virus

హమ్మయ్యా.. ఎబోలా విరుగుడు వచ్చేసింది!

Posted: 09/18/2014 09:29 PM IST
Finnaly doctors and scientists found vaccine to avoid ebola virus

(Image source from: finnaly doctors and scientists found vaccine to avoid ebola virus)

ఇన్నాళ్లవరకు ప్రపంచ అగ్రదేశాలనుసైతం వణికించేసిన ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ కు చివరికి విరుగుడు వచ్చేసింది. ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేసిన అనంతరం ఇది ఎబోలాకు వ్యాక్సీన్ గా పనిచేస్తుందని డాక్టర్లు తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే వాళ్లు ఈ ప్రకటనను విడుదల చేశారు. మొదటగా ఈ టీకాను బ్రిటన్ లో ప్రయోగాత్మకంగా రూథ్ ఎట్కిన్స్ అనే మహిళకు ఇచ్చి పరీక్షించారు. ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ గ్రూప్ సెంటర్ లో నిర్వహించిన ఈ టెస్ట్ తీసుకుని మొట్టమొదటి మహిళ ఈమెనని.. అందుకు ముందుకు వచ్చిన ఆమెకు అంతా అభినందిస్తున్నారు. మరో అరవైమందికి త్వరలోనే ఈ వ్యాక్సీన్ ఇచ్చి పరీక్షించబోతున్నారు.

పశ్చిమాఫ్రికాలో ఎబోలా వ్యాధి బారనపడి ఇప్పటికే వేలమంది మరణించిన విషయం తెలిసిందే! దీనిని నియంత్రించేందుకు పరిశోధకులు, డాక్టర్లు అందరూ కలిసి కొన్నిరోజుల అనంతరం జరిపిన ప్రయోగాల తర్వాత ‘‘చింప్ అడినోవైరస్ టైప్-3’’ అనే  వ్యాక్సీన్ ను రూపొందించారు. అయితే ముందుగా ఇది పనిచేస్తుందా లేదా..? అన్న కోణంలో ఒక చిన్న పరీక్ష నిర్వహించారు. ఎబోలా వ్యాధినుంచి కోలుకున్న ఓ డాక్టర్ నుంచి మరో వైద్యుడు రక్తమార్పిడి చేయించుకున్నాడు. అప్పుడు అతనికి ఈ వ్యాక్సిన్ ఇవ్వగా అతడు ఆరోగ్యవంతుడయ్యాడని రీసెర్చర్లు అంటున్నారు. ఆ తర్వాతే దీనిని ఒక మహిళపై ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం హెల్దీగా వున్న ఓ మహిళలకు ఇలా డెవలప్ చేసిన వాక్సిన్ ను ఇచ్చి.. ఎబోలాను పూర్తి నివారించవచ్చునని నిరూపించే పనుల్లో డాక్టర్లు పూర్తిగా మునిగిపోయారు. అంటే.. ఫైనల్ గా ఎబోలాకు విరుగుడు వచ్చేసిందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ebola virus  ebola virus vaccine  oxford vaxine group centre  

Other Articles