Bill gates about his next generation condoms

condoms, condoms using, male condoms, female condoms, sex, sexual relationship, marriage, wife and husband, bill gates, bill gatest house, bill gates services, next generation, 3g service, 4g service, latest news, innovations, inventions, aids, hiv, sexual diseases, std diseases, doctors, hospitals, research, university of manchester

bill gates encouraging condoms developing for next generation he sponsers 6crore rupees to manchester university about this research : in future all will use next generation condoms for family planning and more satisfaction says bill gates

రాబోయే తరం వాడే కండోమ్ లు ఇవే...

Posted: 09/19/2014 01:44 PM IST
Bill gates about his next generation condoms

బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరిగానే కాకుండా సేవా కార్యక్రమాలకు పెద్దన్నగా అందరికి తెలుసు. తన ట్రస్టుల ద్వారా లక్షల మందికి సేవలు అందిస్తున్నాడీ పెద్దమనసున్న పెద్దాయన. కంప్యూటర్లలో విండోస్ వర్షన్లను అభివృద్ధి చేయించే గేట్స్.. మరొక ముఖ్యమైన ఉత్పత్తిలో కూడా అభివృద్ధి బాటలు వేయిస్తున్నారు. అదే కండోమ్స్. వినడానికి కాస్త వింతగా.., కొత్తగా ఉన్నా.., ఇది నిజం. విండోస్ డెవలప్ చేసే ఈయనకు కండోమ్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఏమిటి అంటే సామాజిక సేవ కార్యక్రమంలో ఇది కూడా భాగమే అని భారత పర్యటనలో భాగంగా తెలిపాడు.

భాతర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ బిజీగా గడుపుతున్నాడు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రముఖులను ఆయన కలిశాడు. ఈ సందర్బంగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టులపై వివరణ ఇచ్చాడు. ‘‘నెక్స్ట్ జనరేషన్ కండోమ్స్’’ తయారు చేసేందుకు తన చారిటీ నుంచి డబ్బులు అందిస్తున్నామన్నారు. మాంచెస్టర్ యునివర్సిటీకి ఇందుకోసం రూ.6కోట్లు ఆర్ధిక సాయం చేశామని చెప్పారు. ప్రస్తుతం శాస్ర్తవేత్తలు రాబోయే తరం కండోమ్ లపై పరిశోధనలు జరుపుతున్నారనీ.., త్వరలోనే వీటిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఇప్పటికే కండోమ్ లు ఉండగా., కొత్తతరం కండోమ్ ప్రత్యేకత ఏమని అడిగితే.., తాము అభివృద్ధి చేసే నిరోధ్ లు కుటుంబ నియంత్రణకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా అదనపు సంతృప్తి వచ్చేలా చేస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికంటే మరింత పలుచగా వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. గ్రాఫేన్, సూపర్ లైట్ కండక్టివిటీ పధార్ధంతో రాబోయే తరం కండోమ్ లను తయారు చేస్తున్నామన్నారు. అటు పేదల జీవితాలను మార్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. ఎల్లపుడూ సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : condoms  bill gates  next generation  latest news  

Other Articles