Ap government to do real estate business

andhrapradesh, andhrapradesh government, andhrapradesh government logo, andhrapradesh government plans, andhrapradesh capital, vijayawada, ap farmers, ap crops, chandrababu naidu, tdp, latest news, real estate, land rates in vijayawada, land rates in krishna district, land rates in guntur, houses

andhrapradesh government plans to buy lands from farmers and others later after land value increases they will sell to others : chandrababu plans to do real estate business by buying lands from farmers and sells it to business persons

రియల్ దందా దిశగా ఏపీ సర్కారు.. మరోసారి రైతుల్ని ముంచేస్తారా..?

Posted: 09/22/2014 03:32 PM IST
Ap government to do real estate business

విజన్ పదం వినగానే గుర్తుకు వచ్చే చంద్రబాబు ఇప్పుడో కొత్త విజన్ తో ముందుకెళ్తున్నారు. ప్రతి సంస్థా ప్రయివేటు పరం అవుతున్న ఈ రోజుల్లో.., ప్రైవేటు చేతుల్లోని రియల్ వ్యాపారాన్ని ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అని డిసైడ్ అయ్యారు. అచ్చం రియల్ వ్యాపారుల్లానే.., ఇప్పుడు భూములు కొనేయ్.., తర్వాత లాభం చూసుకుని అమ్మేయ్ అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఏపీ చాణిక్యుడి మాస్టర్ మైండ్ లోని ఆలోచనలేమిటో పత్రికలు ప్రధాన కధనాలతో ప్రచురించాయి. వాటిని చదివిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వమే భూముల దందాలకు దిగుతుంటే ఏం చేసేదిక అనుకుంటున్నారు.

ప్రభుత్వ భూ సేకరణ ఇలా

విభజన తర్వాత ఏపీలో శాశ్వత రాజధాని విజయవాడ అవుతుందని చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు నుంచే రాజధాని వస్తుందనే నమ్మకంతో బడాబాబులు ఎంత దొరికితే అంత భూమిని కొనిపెట్టారు. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో భూములు ఖాళీగా లేవు. భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇక్కడే చంద్రబాబు ఓ ప్లాన్ వేశారు. అవసరానికి మించి భూమిని తీసుకుని.., తర్వాత అమ్మేస్తే ప్రభుత్వానికి లాభాలు వస్తాయని స్కెచ్ గీస్తున్నారు. ఇలా అమ్మేయటం వల్ల అప్పులు లేకుండా ఏపీ రాజధాని నిర్మించవచ్చని అనుకుంటున్నారు. ఇందుకోసం లక్ష ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. రైతులకు కూడా లాభదాయకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణంకు అవసరమయ్యే ఇరవై ఐదు వేల ఎకరాలు, అదనపు అవసరాల కోసం మరో పాతిక వేల ఎకరాలు పోను మిగిలిన యాబై వేల ఎకరాలను బహిరంగ మార్కెట్ లో అమ్మేసి లాభాలు పొందాలని అనుకుంటున్నారు.

రైతుల నుంచి భూమి సేకరించేందుకు రెండు మార్గాలు అనుసరించాలని నిర్ణయిచారు. అందులో ఒకటి భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ రికార్డుల్లోని మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధర చెల్లించటం. ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా అయితే రూ.8-10లక్షల మద్య ధర ఉంది. మరో విధానంలో అయితే.., ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమికి భూమిని పరిహారంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే సాగు భూమికి పరిహారంగా సాగు భూమే ఇస్తారని చెప్పలేము.

బడాబాబులకే లాభం

ప్రభుత్వ నిర్ణయం కేవలం బడాబాబులకే లాభం కలగజేస్తుంది. ఇప్పటికే భూములను పెద్దలు కొనిపెట్టుకున్నారు. వారి నుంచి తిరిగి ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ లాభపడతారు. ఆ తర్వాత ప్రభుత్వం కొన్న భూముల రేట్లు పెరుగుతాయా., తగ్గుతాయా అనే సంగతి దేవుడెరుగు. అయినవారి ఆస్తులు మాత్రం అమాంతం పెరుగుతాయి. ఒకవేళ భూమి విలువ పెరగకపోయినా., డిమాండ్ లేకపోయినా బాబు ప్రభుత్వానికి దిమ్మతిరగటం ఖాయం.

విజయవాడ సమీపంలో వ్యవసాయానికి పూర్తి అనువుగా ఉండే సారవంతమైన భూములున్నాయి. వీటిని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్దు బాబూ అని చెప్పింది. మనవారు వినకుండా అక్కడే కూర్చుని.. అన్నంత పని చేస్తున్నారు. దక్షిణ బారత ధాన్యాగారంగా పేరున్న ఏపీ.., భవిష్యత్తులో బియ్యం కొనుక్కునే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలా భూములు అమ్మేయటం వల్ల కలిగేది ధన ప్రయోజనం మాత్రమే. రియల్ దందా వల్ల పరిమిత వ్యక్తులే లాభపడతారు. అదే భూమిని తీసుకుని కంపనీలు పెట్టి, పరిశ్రమలు స్థాపిస్తే వేల సంఖ్యలో కుటుంబాలకు ఉపాధి దొరికి బాగుపడే అవకాశం ఉంటుంది. ఇలా చేయకుండా అందినంతా అమ్ముకుందాం అనే భావనతో కొత్త శకానికి తెరతీసింది ఏపీ సర్కారు.

ఈ పధకం వల్ల లాభాల మాట ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.. కాని నష్టాలను మాత్రం ఊహించవచ్చు. సీమాంధ్రలో పంట ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ అంచనాలు తలక్రిందులైతే వేల కోట్ల నష్టం చవిచూడాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పుడీ నిర్ణయం అమలైతే రైతులను భూములు తమకే అమ్మాలని బెదిరించే దళారుల ఆగడాలు మరింత రెట్టింపవుతాయి. అన్నదాత కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలియనిది కాదు. వ్యవసాయం దండగన్న పాపానికి పదేళ్లు ప్రభుత్వంలో లేకుండా పోయారు. ఇప్పుడు ఏపీలో పగ్గాలు చేపట్టగానే మళ్లీ రైతుల నోళ్ళలో మట్టిగొట్టే పనులు చేస్తున్నారు. బాబు చరిత్ర చూసుకుని ముందుకు వెళ్లటం చాలా ఉత్తమంగా విశ్లేషకులు  చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhrapradesh  real estate  latest news  

Other Articles