అంగారకుడిపై పరిశోధన కోసం భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకోంది. అరుణ గ్రహ కక్ష్యలోకి మామ్ ప్రవేశించే సమయానికి మరికోన్ని గంటలే వుండడంతో.. ఏం జరుగుతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ ఉద్వగ్ధభరిత క్షణాల కోసం భారతీయులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అంగారక గ్రహంపై మామ్ ల్యాండింగ్ సురక్షితం కావాలని, విజయవంతం కావాలని అందరూ ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ.. మామ్ విషయంలో నెలకొంది. మామ్ విజయంవంతం కావాలని పూజలు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. భారత్ చరిత్ర సృష్టిస్తుందా..? అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు.
రేపు జరిగే ఈ కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన కీలక విన్యాసం సోమవారం సాఫీగా సాగిపోయింది. ఉపగ్రహంలో 10 నెలలుగా నిద్రాణంగా ఉన్న ద్రవ అపోగీ మోటార్ (లామ్) దిగ్విజయంగా పనిచేసింది. ఫలితంగా కక్ష్యలోకి ఈ ఉపగ్రహ ప్రవేశంపై విశ్వాసం మరింత పెరిగింది. ఆ క్రతువు కూడా పూర్తయితే మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్ కీర్తి పొందుతుంది. అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో అంతరిక్ష సంస్థగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవతరిస్తుంది. అలాగే ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా దేశంగా కూడా గుర్తింపు సాధిస్తుంది.
లామ్‌ను ప్రయోగాత్మకంగా మండించే కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి బుధవారం నాటి తుది అంకంవైపు మళ్లింది. ఆ రోజున ఉదయం 7.17గంటలకు లామ్‌ను 24 నిమిషాల పాటు మండించి, ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు తగ్గిస్తారు. తద్వారా ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి చొప్పిస్తారు. ఈ ప్రక్రియను మామ్ తనంతట తానే నిర్వహించడానికి ఇస్రో.. ఇప్పటికే ఆదేశాలను బట్వాడా చేసింది. అంగారకుడి వద్దకు పంపే ఉపగ్రహాలు, రోవర్లకు సంబంధించి వైఫల్యం పాళ్లు ఎక్కువే. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 51 ప్రయోగాలు చేపట్టగా అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో మామ్‌కు సంబంధించి ఉత్కంఠ పెరిగింది. అంగారకుడిపై జీవం ఉనికికి సంబంధించి ఈ ఉపగ్రహం పరిశోధనలు సాగించనుంది.
రేపు ఉదయం 4.17 గంటలు: ఉపగ్రహ యాంటెన్నా మళ్లిస్తారు.. అనంతరం 7.14: థ్రస్టర్లపై నియంత్రణ చేపడతారు.. ఆ తరువాత 7.17: లామ్ దహనం మొదలు.పెట్టి.. 7.22: ఉపగ్రహం నుంచి భూమికి సందేశాల్ని పంపే వ్యవస్థలు సిద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. 7.30: లామ్ మండుతుందో లేదో కచ్చితమైన సమాచారం రాగానే. 7.41: ఇంధన దహనం నిలిపివేస్తారు. అనంతరం 7.42- 8.04: మధ్య ఉపగ్రహ చలన దిశ మళ్లించి, అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతారు. 7.45: బ్యాలాలులోని డీప్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహ కదలికలపై పరిశీలిస్తారు. 7.47: లామ్ ఇంధనం పూర్తిగా దహనమైన కబురు.అందిన తరువాత మధ్యాహ్నం 12.30: ఉపగ్రహం నుంచి తొలిచిత్రం ఇస్రో శాస్త్రవేత్తలు అందుకుంటారు. దీంతో ప్రయోగం విజయవంతం అవుతుంది. భారత్ చరిత్ర సృష్టించాలని ఆశిస్తూన్న దేశస్థులందరూ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more