మంగళ్యాన్ ప్రయోగం ఫలించింది. భారత ఉపగ్రహం విజయవంతంగా అంగారక కక్ష్యలోకి వెళ్ళింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మామ్ సూపర్ హిట్ అయింది. ఇదే ప్రయోగానికి అమెరికా క్యూరియాసిటి రోవర్ రెండు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే.., భారత్ కేవలం రూ.450కోట్లతోనే చేసి చూపించింది. అగ్రరాజ్యానికి మనవారు ఏమి తీసిపోరు అని నిరూపించింది. ఈ ప్రయోగంతో అంగారక గ్రహంపైకి వెళ్లిన తొలి ఆసియా దేశంగా చరిత్రకెక్కింది. మనవారు ఈ కొద్ది మొత్తంతోనే ఈ భారీ విజయం సాధించారు. ఇదే సమయంలో ప్రయోజనం పెద్దగా ఏమి లేకపోయినా వేల కోట్లను వృధాగా ఖర్చు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ మద్య జరిగిన ప్రధానమైన అంశాలను ఒకసారి చూద్దాం.
అంబాని ఇళ్లు..
భారత కుభేరుడు ముకేష్ అంబాని ఇంటినే తీసుకుందాం. ఆయన హోదాకు తగ్గట్లు ఇళ్లు ఉండటంలో ఏ తప్పు లేదు. కానీ ఆడంబరాల కోసం మరీ ఏకంగా.., 222 వందల అమెరికన్ డాలర్లు ( 2008 లెక్కల ప్రకారం) ఖర్చు చేసి మరీ ఈ భారీ భవనం నిర్మించారు. 4లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భారీ భవనంలో 27 అంతస్థులు ఉన్నాయి. హోదాకు తగినట్లు ప్రత్యేక గుర్తింపు ఇది ఉన్నప్పటికీ.., ఇందులో సగం డబ్బను పేదల కోసం ఖర్చు చేసినా.., వారి బతుకులు మారటంతో పాటు.., ఎందరికో ముఖేష్ ఆదర్శంగా నిలిచేవారు. కాని ఇది వారి వ్యక్తిగత విషయం కాబట్టి ఏమి అనలేము.
ముంబై మెట్రో
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇసుకవేస్తే రాలనంత జన రద్దీ ఉండే ప్రాంతాలు చెప్పలేనన్ని ఉన్నాయి. దేశంలో ఎన్నో కంపనీల ప్రధాన కార్యాలయాలు ముంబైలో ఉన్నాయి. లక్ష రూపాయల ఆదాయం ఉండే కంపనీ నుంచి.., లక్షల కోట్లు ఆర్జించే కంపనీలకు ఈ సాగర తీరం నెలవయింది. కంపనీలు భారీగా రావటంతో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఎంతోమంది ముంబై వచ్చి ఉంటున్నారు. వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రోరైలు చేపట్టారు. కాని ఏం లాభం.., వేలు ఖర్చు చేసినా.., ఆశించిన ఫలితం రాలేదు. అంతేకాకుండా అనుకున్నదానికంటే బడ్జెట్ దాదాపు రెట్టింపయింది ( రూ. 2,356కోట్లు అనుకుంటే.., రూ.4,321 కోట్లు ఖర్చు అయింది). అయినా కేవలం 11.40కిలోమీటర్లు మాత్రమే రైలు తిరుగుతోంది. అటు వర్షాకాలపు ఇబ్బందులు అయితే చెప్పనవసరం లేదు.
బొగ్గు స్కాం మసి
దేశంపై బొగ్గు స్కాం మాయని మచ్చలా మిగిలింది. ఏకంగా రూ.1.86లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. స్వయంగా ప్రధాని ఆధీనంలోని ఈ శాఖలో ఇంత భారీ కుంభకోణం జరగటం గమనార్హం. ఈ డబ్బు ఉమ్మడి ఏపీకి ఒక ఏడాది బడ్జెట్ తో సమానం. అంటే ఒక సంవత్సరం పాటు రాష్ర్టానికంతా సరిపోయే బడ్జెట్ ను దేశంలోని రాజకీయ దొంగలు దోచేశారన్నమాట. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది.
అద్దాల మేడకు 5వేల కోట్లా..,?
ఇక ముంబైలోని చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఎంత చెప్పకున్నా తీరదు. ఎయిర్ పోర్ట్ లో నాట్యమాడే నెమలి తరహాలో డిజైన్ చేసేందుకు గోడలను ప్రత్యేకంగా అద్దాలతో అమర్చారు. వీటికోసం అక్షరాల రూ. 5,500కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 12,500 కోట్లు. మిగతా రూ.7వేల కోట్లతో ఎయిర్ పోర్టు నుంచి మూడు కిలోమీటర్ల వరకు ‘ఆర్ట్ వాక్’ ‘జయహే’ పేరుతో భారతీయ కళలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
పెళ్ళికి 500కోట్లు
మీకు ప్రమోద్ మిట్టల్ తెలుసా..? బహుశా అంతగా ఐడియా ఉండకపోవచ్చు. కాని సునీల్ మిట్టల్ అయితే తెలుసు కదా..అదేనండి స్టీల్ దిగ్గజం. ఆయన సోదరుడే మన ప్రమోద్ మిట్టలుడు. ఈ చిన్న మిట్టల్ కూతురు పెళ్ళి ఖర్చు ఎంతో తెలుసా... రూ. 500కోట్లు. మీరు నోరెళ్ల బెట్టినా ఇది మాత్రం నిజమండి.. కావాలంటే గూగుల్ తల్లిని అడిగి చూడండి. మిట్టల్ కూతురు పెళ్ళి ఖర్చుతో మంగళ్యాన్ ప్రయోగం చేయటమే కాకుండా.., ప్రయోగంలో కృషి చేసిన వారందరికి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వొచ్చన్నమాట. కాని ఇది కూడా వారి పర్సనల్ కాబట్టి విమర్శలు చేయలేము. కాకపోతే అంత ఖర్చా అనుకోకుండా ఉండలేము.
సహారా-విమానాలు
ఇక సహారా కంపనీ గ్రూపు అధినేత సుబ్రతా రాయ్.., ఏకంగా ఇన్వెస్టర్ల దగ్గర రూ. 24వేల కోట్లు వసూలు చేసి సైలెంట్ గా కూర్చున్నాడు. దీనిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. అటు రక్షణ శాఖ ఫ్రెంచ్ కంపనీతో హెలికాప్టర్ల కోసం రూ. 61వేల కోట్లకు 2009లో ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం ఈ ఖర్చు రూ.1,50,000కోట్లకు చేరింది. అంటే రూ. 90వేల కోట్ల తేడా అన్నమాట. ఇదంతా ఎవరి డబ్బు.. ప్రజల సొమ్మను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. ఇన్నివేల కోట్లను వృధాగా అయినా పోనిస్తారు కానీ.. సంక్షేమ పధకాలకు మాత్రం ఖర్చు చేయరు. ఏదేమైనా ‘‘ఇండియా ఇన్ క్రెడిబుల్.., మేరా భారత్ మహాన్’’
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more