Ap cm chandrababu naidu decided to transport the government sectors to vijayawada from hyderabad

ap cm chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu vijayawada tour, chandrababu naidu press meet, chandrababu naidu visits vijayawada durga temple, andhra pradesh government, andhra pradesh state map, tdp party leaders, ap tdp ministers

ap cm chandrababu naidu decided to transport the government sectors to vijayawada from hyderabad

ఏపీ రాజధానిలో బాబు సమీక్షలు!

Posted: 09/27/2014 09:24 PM IST
Ap cm chandrababu naidu decided to transport the government sectors to vijayawada from hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకనుంచి తాను విజయవాడ నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తానని స్పష్టం చేశారు. ఇటీవలే బాబు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రసంగించిన నేపథ్యంలో తన మనోభావాలను పంచుకున్న విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి వుండి తెలంగాణ అసెంబ్లీలో చర్చలు కొనసాగించడం చాలా బాధాకరంగా వుందని, త్వరలోనే హైదరాబాద్ నుంచి మకాం మార్చుతామని ఆయన ప్రకటించిన సంగతి విదితమే! ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలను బాబు నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలను త్వరలోనే విజయవాడకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు.

గన్నవరంలోని మేధాటవర్స్ ని పరిశీలించిన బాబు.. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే పనిలో ముగినిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రభుత్వ విభాగాలని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించగలిగితే.. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్ని మేధాటవర్స్ లో ఏర్పాటు చేయడానికి ఎంతవరకు అనుకూల పరిస్థితులు వుంటాయని ఆయన అధికారుల నుంచి ఆరా తీశారు. అధికారంలోకి వచ్చి 100 పూర్తి అయినప్పటికీ ఇంకా ఆంధ్రాలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించని నేపథ్యంలో.. బాబు ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పర్యటనలో భాగంగా దుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఆయన... మీడియాతో మాట్లాడుతూ అక్కడ నిర్వహించబోయే ప్రభుత్వ కార్యాలయాల గురించి పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. అమ్మవారు కొలువైన విజయవాడ నుంచి రాష్ట్రాన్ని పాలించడమనేది నిజంగా తనకు గొప్ప వరమని అభిప్రాయపడ్డారు. దుర్గమ్మ గుడిని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి పరుస్తామని తెలిపిన ఆయన... విజయవాడలో వున్న భవానీ ఐలాండ్స్ ని అంతర్జాతీయ స్థాయిలో టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎప్పుడు బదిలీ చేస్తారనే విషయాన్ని మాత్రం తెలుపలేదు. కానీ త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో కన్నా విజయవాడలోనే రాష్ట్రాభివృద్ధిని సమీక్షించుకోవడానికి వీలుగా వుంటుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles