Medals png

asiad games 2014, archery, jyothi surekha, bronze medal, gold medal, silver medal

india bags another gold, including silver, Bronze medal for the first time in 17th asiad archery medal

భారత్ ఖాతాలో మరిన్న పతకాలు..

Posted: 09/27/2014 09:48 PM IST
Medals png

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తన ఖాతాలో మరో ఐదు పతకాలను వేసుకుంది. స్వర్ణంతో పాటు రెండు రజిత, రెండు కాంస్య పతకాలను తన సాధించింది. ఇవాళ్టి రోజు భారత్ కు అనుకూలమైన రోజుగా క్రీడాకారులు గణిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఏకంగా రెండు స్వర్ణాలను భారత్ సాధించింది. ఆర్చరీ పురుషలు విభాగం తరువాత స్వ్కాష్ లో భారత పురుషల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ మలేషియాతో తలపడిన భారత టీం 2-0 తేడాతో పరిపూర్ణ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఈవెంట్ లో మెరిసిన భారత్ పసిడిని  తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీం ఈవెంట్ లో సౌరవ్ ఘోశల్, హరివిందర్ పాల్ సింగ్ ,కుశ్ కౌర్, మహేష్ మనోన్కర్ లు భారత్ కు స్వర్ణాన్ని సాధించిపెట్టారు. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు మూడు స్వర్ణాలు లభించాయి.

మరోవైపు మహిళల స్వ్కాస్ ఈవెంట్ లో భారత్ తొలిసారి రజతాన్ని చేజిక్కించుకుంది. అంతకుముందు మహిళల విలువిద్య విభాగంలో కాపౌండ్ అర్చరీలో త్రిశ రెండవస్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. 3వేల కిలో మీటర్ల మహిళల స్టీపుల్ ఛేజ్‌లో భారత్‌కు రజతం దక్కింది. మహిళల స్టీపుల్ ఛేజ్‌లో లలిత బాబర్ రజతాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత క్రీడాకారిణి సుధాసింగ్ కాంస్యాన్ని భారత్ ఖాతాలో వేసింది.  ఆటు భారత రెజ్లర్లు కూడా అసియా క్రీడల్లో మెరిశారు. రెండు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. 48 కిలోల విభాగంలో వినీష్, 63 కిలోల విభాగంలో గీతికాలు రజత పతకాలను సాధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asiad games 2014  archery  jyothi surekha  bronze medal  gold medal  silver medal  

Other Articles