No bathukamma festival tradition in mahabubnagar district

D K Aruna, gadwal mla, Bathukamma festival, mahabubnagar district

no bathukamma festival tradition in mahabubnagar district says d k aruna

ఈ తెలంగాణ జిల్లాలో ‘బతుకమ్మ’ లేదు

Posted: 09/28/2014 07:15 PM IST
No bathukamma festival tradition in mahabubnagar district

తెలంగాణ జిల్లాల్లో దసరా పండుగను పురస్కరించుకుని అన్ని గ్రామాలు, పల్లెలు, పట్టణాలలో బతుకమ్మ పండగ ఘనంగా సాగుతుంటే.. అక్కడ మాత్రం బతుకమ్మే లేదట. మాది తెలంగాణ జిల్లానే కానీ ఇక్కడ బతుకమ్మ సంప్రదాయమే లేదు అని నిట్టూరుస్తున్నారు మాజీ మంత్రి. అమో ఎవరో కాదు మాజీ మంత్రి డీకే అరుణ, తమ మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని అన్నారు. అలాంటి జిల్లాలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవితను పిలవడమేంటని అరుణ ప్రశ్నించారు.

పండగ సెంటిమెంట్తో అధికార టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. ఈ సాకుగా చూపి ప్రజలను విభజించాలనుకుంటోందని ఆరోపించారు. పాలమూరు జిల్లాల్లో మంత్రిగా తాను అధికారంలో వున్న సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు లోంగని నేత.. ఇప్పడు ప్రభుత్వంపై అరోపణలు గుప్పిస్తే వారు స్పందిస్తారా.. ఇంతకీ అరుణను కాదని ఎంపీ కవితను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందుకు కోసం వచ్చిందా అనేది తేలియాల్సి వుంది.

అయితే మన మీడియా మిత్రులు మాత్రం ఏం తక్కువ తిన్నారా.. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు బతుకమ్మను ఎలా అడారని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడామని డికే అరుణ సమాధానం ఇచ్చారు. దసరా పండగకు సెలవులు పెంచి... సంక్రాంతికి తగ్గించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

జి,మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D K Aruna  gadwal mla  Bathukamma festival  mahabubnagar district  

Other Articles