Panneerselvam sworn as tamilnadu chief minister

panneerselvam, panneerselvam chief minister, panneerselvam wiki, panneerselvam family, panneerselvam photo, panneerselvam latest, panneerselvam government, panneerselvam gossips, jayalalitha, jayalalitha arrest, jayalalitha latest, jayalalitha jail, bangalore court, bangalore jail, parappana agrahara jail, disappropriation of assets case, latest news, politics, chennai, tamilnadu, national news, karnataka

panneerselvam sworn as tamilnadu chief minister : with jayalalitha arrest tamilnadu got new chief minister former finance minister loyalist to jayalalitha panneerselvam become chief minister of the state

సీఎంగా ప్రమాణం చేసి సెల్వం కంటతడి

Posted: 09/29/2014 03:17 PM IST
Panneerselvam sworn as tamilnadu chief minister

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు. చెన్నై లోని తమిళనాడు రాజ్ భవన్ లో గవర్నర్ రోశయ్య సెల్వంచే ప్రమాణం చేయించారు. సెల్వంతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. జయలలిత జైలుకు వెళ్ళటంతో ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ కు పదవీ బాధ్యతలు అప్పగిస్తూ  కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2000 సం.లో కూడా జయలలిత అరెస్టయిన సందర్బంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో జయ భూ కుంభకోణంలో ఇరుక్కుని పదవిని పోగొట్టుకున్నారు.

తాజాగా అక్రమాస్తుల కేసులో పురుట్చితలైవి అరెస్టు కావటంతో పన్నీర్ మరోసారి రాష్ర్ట బరువు బాధ్యతలు మోసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేస్తూ పన్నీర్ సెల్వం కంటతడి పెట్టారు. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉండటమే కాకుండా.., పార్టీ నేతల్లో కూడా మంచి పేరున్న వ్యక్తిగా పన్నీర్ సెల్వం నిలిచారు. అందువల్లే రెండవసారి కూడా సీఎం పదవి ఆయన్నే వెతుక్కుంటూ వచ్చింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  panneerselvam  latest news  tamilnadu  

Other Articles