ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక రంగంలో నేటి యువకులు దెయ్యాలు వున్నాయంటూ ఫక్కున నవ్వేస్తారు కానీ.. రాత్రిసమయంలో ఎక్కువగా చీకటి వున్న ప్రాంతాలకుగానీ, భూత్ బంగ్లాలకు వెళ్లడానికి గానీ భయపడటం మాత్రం నిజం! అందులో దెయ్యాలు వుంటాయో లేవో తెలీదు కానీ.. ఆ పరిసర ప్రాంతాలు చాలా భయంకరంగా వుంటాయి. చాలా సైలెంట్‌గా వుండే ఆ ప్రదేశాల్లోనే ఎవ్వరూ ఊహించని కొన్ని అనూహ్యమైన శబ్దాలు వినిపిస్తుంటాయని.. అప్పుడప్పుడు తెల్లరంగు వస్త్రాలు కనిపిస్తుంటాయని చాలామంది అంటుంటారు. దాంతో చాలావరకు ప్రజలు అటువంటి ప్రదేశాలకు వెళ్లరు. ముఖ్యంగా భూత్ బంగ్లాలకైతే వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. అటువంటి భూత్ బంగ్లాయే ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్నిరోజుల నుంచి హల్‌చల్ చేస్తోంది. దానివెనకున్న కథేంటో ఒకసారి తెలుసుకుందాం పదండి...
అమెరికాలో వుంటున్న శారద పెద్ద కుమార్తె జయప్రద, ఆమె ఇద్దరు కుమార్తెలు హైదరాబాదులోని బేగంపేట, కుందన్‌బాగ్, ఉమానగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన బంగ్లాలో నివాసం ఉండేవారు. సాఫీగానే కొనసాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా కొన్ని తగాదాలు వచ్చిపడ్డాయి. ప్రతిరోజూ ఒక చిన్నమాటకు గొడవలు చేసుకోవడం, కొట్టుకోవడం జరుగుతుండేవి. దాంతో విసిగిపోయిన జయప్రద.. తన భర్తతో విడిపోవాలని నిశ్చయించుకుంది. భర్త కూడా ఆమె నుంచి విడిపోవాలనుకుని వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అలా విడిపోయిన కొన్నాళ్ల తరువాత జయప్రద, ఆమె ఇద్దరు కుమార్తెలు మానసిక క్షోభతో ఆ బంగ్లాలోనే మరణించారు.
ఇదిలావుండగా.. ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించారు. అయితే వారందరూ అలా మరణించి వుండటం గమనించినవాళ్లు.. ఇంకా ఎక్కువ దోచుకెళ్లడానికి వీలుగా వుంటుందనుకుని భావించి, లోపలున్నదంతా దొచుకెళ్లిపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆ ఇంట్లో మూడు శవాలు ఉన్నాయని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు.. వారు మానసిక ఆందోళనతో మరణించారని తేల్చేశారు. అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు వచ్చి మరణించిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇంతవరకు బాగానే వుందికానీ.. ఇక్కడే మొదలైంది అసలు కథ! అదేమిటంటే.. వారు ముగ్గురు చనపోయినప్పటి నుంచి వారి కుటుంబసభ్యులు ఆ బంగ్లాను అమ్మకానికి పెట్టారు. అయితే ఆ భవంతిపై అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు పడ్డాయి. ఎంతో ఖరీదైన ఆ భవంతిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్లు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆ భవనంలో దెయ్యాలున్నాయంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఆ భవంతిని ఎవ్వరూ కొనుగోలు చేయొద్దని, అందులో దెయ్యాలు నిత్యం సంచరిస్తుంటాయని బాగానే డప్పు వాయించారు. అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం తక్కువ ధరకే భవంతిని అమ్మడానికి దిగిరాలేదు. దీంతోవాళ్లు మరో తెలివైన పన్నాగం వేశారు.
ఫేస్‌బుక్‌లో భూత్ బంగ్లా అంటూ ప్రత్యేకంగా ఒక పేజ్‌నే క్రియేట్ చేసి పడేశారు. అక్కడ దెయ్యాలున్నాయని ప్రచారం చేయడం ప్రారంభించారు. అంతగా నమ్మకం లేకపోతే.. వచ్చి చూసుకోవాలంటూ సవాళ్లు కూడా విసిరారు. దీంతో యువకులు దానిని చూసేందుకు అర్ధరాత్రుళ్లు వస్తూ హల్‌చల్ చేయడం మొదలుపెట్టేవారు. అరుపులు కేకలతో చుట్టుపక్కల వున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. కొన్నిరోజుల క్రితం పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా యువకుల తీరు మారకపోవడంతో మళ్లీ రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని, దెయ్యాలంటూ హల్‌చల్ చేయసాగారు. దీంతో ఆ యువకుల్ని పోలీసులు రిమాండుకు తరలించారు. ఇంకొకసారి ఎవరైనా ఆ ఇంటి చుట్టూ తిరిగినట్టు తెలిసినా, పట్టుబడినా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇదీ.. ఆ భూత్ బంగ్లా కథ!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more