Telangana state 108 employees association letter to cm kcr

telangana state 108 employees association, telangana employees, telangana government employees, cm kcr, telangana state news, kcr news, telangana employees letter to kcr, kcr letter news, telangana jobs, jobs in telangana, kcr latest press meet, kcr comments

telangana state 108 employees association letter to cm kcr that they are not getting salaries from six months

6 నెలలనుంచి జీతాలు లేవు.. ఎలా బతకాలి కేసీఆర్! ఉద్యోగులు

Posted: 10/03/2014 07:29 PM IST
Telangana state 108 employees association letter to cm kcr

ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకోవడంతోపాటు ఆర్థికంగా ఎక్కువ సమస్యలు రావడంతో కొంతమంది ఉద్యోగస్తులకు కొన్నాళ్లవరకు జీతాలు అందలేదు. అయినా వాళ్లు తమ విధులను నిర్వర్తించడం మానేయలేదు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాల్లో తిరిగి వెలుగులు వస్తాయని భావించిన వాళ్లకి మళ్లీ నిరాశే మిగిలినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఏర్పడిన తరువాత కూడా వాళ్లకు జీతాలు అందలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సదరు ఉద్యోగస్తులు ఒక్కసారి కట్టగట్టుకుని ఏకంగా సీఎం కేసీఆర్‌నే ప్రశ్నించారు. ‘‘6 నెలలనుంచి జీతాలు అస్సలు అందలేదు.. మేమెలా బతకాలి?’’ అంటూ సీఎం ముందు తమ గోడును వినిపించారు.

తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం రాత్రి ఒక సంచలనమైన లేఖ రాసింది. సదరు లేఖను చూసిన కేసీఆరే కొద్దిసేపటివరకు షాక్ నుంచి తేరుకోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఖ ప్రకారం.. తమకు గత ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని, లేకపోతే ఎలా బ్రతుకుతామని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమకు అందాల్సిన ఈనెల జీతాలు కూడా ఇంకా అందకపోవడంతో దసరా, బక్రీద్‌లాంటి పండగలు చేసుకోలేని దుస్థితిలో వున్నాయని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగస్తులు అయినప్పటికి కూడా నిరుద్యోగులలాగే అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు పేర్కొంటున్నారు.

కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనైనా తమకు వెంటనే జీతాలు అందేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలందరూ సంతోషంగా పండగలు జరుపుకుంటే.. ఉద్యోగస్తులైన తమ కుటుంబాలు మాత్రం పస్తులు వుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి తమకు ప్రతినెలా వేతనాలు అందేలా చూడాలని వాళ్లు కేసీఆర్‌తో వేడుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state 108 employees association  kcr  jobs  press meet  

Other Articles