Dont repay loans even after recieving notices

palle raghunath reddy, farm loan waiver, puttaparthi, repay, loans, bank notices

dont repay loans even after recieving notices from banks says palle raghunath reddy

నోటీసులిచ్చినా రుణాలు చెల్లించకండి..

Posted: 10/05/2014 09:53 PM IST
Dont repay loans even after recieving notices

బ్యాంకుల నుంచి వ్యవసాయ, డ్వాక్రా రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చినా ఎవ్వరూ చెల్లించవద్దని రైతులు, మహిళలకు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.  రైతు, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుందని చెప్పారు.

రైతులు, మహిళలు ఒక్కపైసా కూడా చెల్లించవద్దన్నారు. వ్యవసాయ సాధికార పరిషత్ ద్వారా రైతు రుణాలు చెల్లించి తిరిగి అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా 20 శాతం రుణాలు చెల్లించడమేగాక 20 శాతం కొత్త అప్పులు ఇచ్చేలా బ్యాంకు అధికారులతో చర్చించామన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల రూ.8,800 కోట్లు ప్రభుత్వానికి అదనపు బరువు పడుతుందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా పారిశుధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఐదెకరాల నిబంధనతో ఎవరికైనా పింఛన్ కట్‌చేసి ఉంటే  తిరిగి అందేలా చూస్తామన్నారు. సర్కార్ జిల్లాల ప్రాంతంలో అర ఎకరా భూమి రాయలసీమలో 15 ఎకరాలకు సమానమని చెప్పారు. గ్రామ కమిటీల్లో కక్షసాధింపుతో అర్హుల పింఛన్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు ఇదివరకు చెల్లించిన డిపాజిట్లన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రానికి తెప్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : palle raghunath reddy  farm loan waiver  puttaparthi  repay  loans  bank notices  

Other Articles