16 facts you probably didn t know about mahatma gandhi

Congress, religious harmony, Boer war, Great Britain, Nobel Peace prize,.Madurai, Steve Jobs, major roads, football, Irish accent

16 Facts You Probably Didn’t Know About Mahatma Gandhi

నమ్మగలరా..! బోయెర్ యుద్ధంలో సార్జంట్ మేజర్ గా గాంధీ

Posted: 10/06/2014 02:49 PM IST
16 facts you probably didn t know about mahatma gandhi

దక్షిణాఫ్రికాలో బారిస్టర్ గా ఉధ్యోగం రావడంతో అక్కడికి వెళ్లిన గాంధీ.. ఆ సమయంలో జరిగిన రెండో బోయెర్ యుద్దంలో బ్రిటీష్ పాలకులకు అనూగూణంగా యుద్ద రంగంలోకి కదం పెట్టారు భారత జాతిపిత మహాత్మా గాంది. దక్షిణ ఆఫ్రికాలో ట్రాన్స్‌వాల్ ప్రజాస్వామ్య వ్యవస్థ ముగింపు దశలో మరియు బ్రిటీష్ పెత్తనం ప్రారంభంలో రెండవ బోయెర్ యుద్ధం (1899 నుండి 1902 వరకు) జరిగింది. ఈ యుద్ధంలో సార్జంట్ మేజర్ గా పనిచేశారు. దక్షిణాఫ్రికాలో వున్నప్పుడు ఆయన ఈ యుద్దంలో పాల్గొన్నారు. బ్రిటీష్ సైన్యానికి మద్దతుగా ఆయన స్వచ్చందంగా పాల్గొన్నారు. సుమారు 1400 మంది భారతీయ వ్యాపారస్థులు, నిపుణులతో కలసి ఆయన ఇండియన్ వాలంటీర దళాన్నిఏర్పాటు చేశారు.

యుద్దంలో క్షతగాత్రులైన వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చాడు. భీకర యుద్దం జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఇండియన్ వాలెంటీర్ అంబులెన్స్ దళం ఆధ్వర్యంలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ సేవలందించారు. 31 మే 1902న వెరీనిగింగ్ శాంతి ఒప్పందంలో యుద్దం ముగిసే వరకు ఆయన సేవలు అందించారు. అక్కడి రక్తపు టేరులు, యుద్దంలో గాయాలపాలైన వారి బాధను ప్రత్యక్షంగా చూసిన గాంధీ చెల్లించిపోయారు. యుద్దం చేయాల్సి వస్తే అహింసా మార్గంలోనే చేయాలని అప్పుడే అతనిలో భీజం నాటుకుంది. ఇదే మహాత్ముడని అహింసా వాదిని చేసింది. ఎక్కడ ఎలాంటి యుద్దవాతావరణం అలుముకున్నా.. దానిని నివారించేందుకు గాంధీజీ తన ప్రయత్నాలు చేసేవారు. హిట్లర్, ఎయిన్ స్టీన్, టాల్స్ టాయ్ తదితర దేశాధినేతలతో గాంధీజీ ఉత్తరప్రత్యుత్తరాలు రాసేవారు.

దేశ స్వాత్రంత్ర్య సంబరాలు చేసుకునే సమయంలో నెహ్రూ ప్రసంగించే సమయంలోనూ గాంధీజీ అక్కడ లేదు. ఆయన కోల్ కతాలో మతాలతో మనుషులు విడిపోకూడదని మతసామరస్యం వెల్లివిరియాలని కాంక్షిస్తూ నిరసన దీక్షబూనారు. మహాత్ముడు హత్యచేయబడిన రోజున వేసుకున్న వస్త్రాలు ఇప్పటికీ మదురైలోని గాంధీ మ్యూజియంలో భద్రపర్చారు. స్వాత్రంత్య సంగ్రామంలో స్థాపించిన కాంగ్రెస్ పార్టీని ఆయన తన మరణానికి ఒక్క రోజు ముందే రద్దు చేయాలని ప్రతిపాదనను తీసుకోచ్చారు. అపిల్ ఫోన్స్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ పాల్ జాబ్స్ కు మహాత్ముడంటే అమిత ప్రేమ. అందుకనే మహాత్ముడిలా తాను గుండ్రటి కళ్లజోళ్లను పెట్టుకుంటారు.

బాపూజీలోని నాయకత్వ లక్షణాలు అయనను 12 దేశాలు, 4 ఖండాలలో పౌర హక్కుల కోసం ఉద్యమించేలా చేసింది. ప్రజా హితం కోరిన ఆయన 12 దేశాల పౌర హక్కుల కోసం తనపై బాధ్యతలు వేసుకున్నారు. అందుకే మహాత్ముడు మరణించిన సమయంలో నిర్వహించిన అంతిమ యాత్రకు దేశ, విదేశాల నుంచి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. గాందీజీ అంతిమ యాత్ర 8 కిలోమీటర్ల పోడువున సాగిందంటే ప్రజలను ఆయన అంతగా జాగృతం చేశారు కాబట్టే. దేశ స్వతంత్ర్య సంగ్రామంలో అహింసయుతంగా సాగిన మహాపోరాటాన్ని నడిపిన మహాత్ముని సేవలను ఎట్టకేలకు గుర్తించిన బ్రిటన్ సామ్రాజ్యం అతను మరణించిన తరువాత 21 ఏళ్లకు అతని గౌరవార్థం పొస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.

మహాత్ముడు రోజుకు సాలీనా 18 కిలోమీటర్ల దూరం నడిచే వారని, ఈ మేర ఆయన నడకతో రెండు సార్లు ప్రపంచాన్ని చుట్టేయ్యవచ్చనంటున్నారు అయనపై అధ్యయనం చేసిన వారు. సంగ్రామోద్యమంలో అడుటుపెట్టిన మహాత్ముడు చివరి రోజుల్లో ఎలాంటి అధికారక రాజకీయ పదవులను అలంకరించలేదు. మహాత్ముడు తన వృద్దాప్యంలో నడుపు వస్త్రంలో ఎప్పడు తన పళ్ల సెట్ ను పెట్టుకుని తిరిగేవారు. గాందీజీ తొలినాళ్లలో ఐరిష్ ఉపాధ్యాయులు విద్యాబోదన చేయడంతో ఆయన ఐరిష్ యాసలోనే అంగ్లంలో మాట్లాడేవారు. గాంధీజీ పుట్ బాల్ అంటే అమితమైన ఇష్టం అందుకనే పాసివ్ రెసిస్టర్స్ క్లబ్ పేరిట దర్బన్, ప్రిటోరియా, జోహన్నస్ బర్గ్ లలో పుట్ బాల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 53 పెద్ద రహదారులతో పాటు దేశం వెలుపల 48 రహదారులకు గాంధీజీ సంస్మరణార్థం ఆయన రోడ్డుగా నామకరణం చేశారు.

ఉపఖండంగా పేరొందిన భారత దేశ స్వతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న గాంధీ.. అహింసా మార్గంలోనే స్వరాజ్యాన్ని సాధించారు. ఇంత చేసిన బాపూజీని ఐదుసార్లు నోబుల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. అయితే మరణించిన వారికి ఈ అవార్గును అందజేయలేమని నోబుల్ శాంతి బహుమతి కమిటీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. రేపటితో జీవితం అంతమవుతున్న భావనతో ఇవాళే పనిచేయాలని గాంధీ పనులను చేసేవారు. అందుకే ఆయన చేసిన ప్రతీ పని బావితరాలకు అధర్శవంతమయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles