తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలిగా షర్మిలను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. తెలంగాణలోని పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణుల అభ్యర్థన మేరకు షర్మిలాను పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. వైసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పోరాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ పూర్తిగా అందుబాటులో ఉంటానని హామీయిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. 2019లో తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు. అత్తాపూర్ క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వారిలో వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన నాయకుడు లేరన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ఆర్ ...ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. తెలంగాణలో 17 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న బాధ ఉందని, దాన్ని తొలగించాలనే ఆలోచన చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు నేనున్నాను అని వైఎస్ఆర్ భరోసా ఇచ్చారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని షర్మిల అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more