Woman suicide by irritated with pimples on face

pimples, pimples on face, pimples fore head, pimples on nose, pimples treatement, pimples surgery, pimples removing methods, health tips, face glow treatments, beauty tips, ladies tips, ladies beauty tips, beauty tips in telugu, latest updates, indore, suicide, national news

a girl in indore commits suicide with by irritating pimples on face feeling ugly her self : a girl feels with pimples her face looks ugly with that feeling she commit suicide

మొటిమలున్నాయని ఆత్మహత్య చేసుకుంది

Posted: 10/13/2014 05:54 PM IST
Woman suicide by irritated with pimples on face

ఈ మద్య ఆత్మహత్య ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి తనువు చాలించటం సమాధానం అనుకుంటున్నారు. సమస్య చిన్నదా.., పెద్దదా అనే తేడా లేకుండా చావే పరిష్కార మార్గం అని డిసైడ్ అవుతున్నారు. తాజాగా ఇండోర్ లో ఓ యువతి ముఖంపై మొటిమలు తగ్గటం లేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. వినటానికి నవ్వొస్తున్నా ఇది నిజం. ఇండోర్ లోని నిధి మాల్వియా అనే 22సంవత్సరాల యువతికి సాధారణంగా అందరు అమ్మాయిలకు వచ్చినట్లుగానే ముఖంపై మొటిమలు వచ్చాయి.

అయితే ఎంత ప్రయత్నించినా అవి పోవటం లేదు. ఎన్ని క్రీములు, ఇతర చికిత్స విధానాలు పాటించినా పూర్తి ఫలితం మాత్రం రాలేదు. మొటిమల వల్ల తాను అందంగా కన్పించటం లేదు అని బాధపడింది. క్రమంగా నిధిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడింది. ఫలితంగా బయటకు వెళ్ళలేక, నలుగురిలో కలవలేక చాలా ఇబ్బందులు అనుభవించింది. వీటన్నిటికంటే ఆత్మహత్య చేసుకోవటమే మేలు అన్నపించి విషం తాగింది. విపరీతంగా వాంతులు చేసుకోవటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటకు వచ్చింది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవటంతో చికిత్స చేసినా ఫలితం లేకుండా చనిపోయింది.

ఇలా క్షణికావేశాలకు లోనయి చనిపోవటం వల్ల కన్నవారికి కడుపుకోత.., మన అనుకున్న వారికి దుఖం తప్ప ఏమి మిగలదు. కాబట్టి సమస్యను నిలబడి ఎదిరించాలి.. పోరాడితే ఏమైనా సాధించవచ్చు. చావటానికి ఉన్న దైర్యంలో కొంత బ్రతకటానికి ఉపయోగించినా ఎన్నో అద్బుతాలు చేయవచ్చని చాలామంది నిరూపించారు. అంతేకాకుండా సహజత్వమైన అందాన్ని కోరుకోవాలి తప్ప.., క్రీములు ఇతర సాధనాల వల్ల అందంగా కన్పించాలని భావిచవద్దు. వాటి వల్ల యవ్వనంలో అందంగా కన్పించినా.., వయస్సు మీదపడే కొద్దీ భయంకరమైన చర్మ సమస్యలు వస్తాయన్న విషయం అంతా గుర్తుంచుకొండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pimples  suicide  indore  latest updates  

Other Articles