Use german technology in building vishakapatnam

hudhud cyclone, hudhud cyclone effect, hudhud cyclone affect, hudhud cyclone latest updates, germen technology in construction, latest updates, chandrababu naidu on hudhud, chandrababu on vishaka renovation, hudhud latest images, narendra modi on hudhud, hudhud rescue relief operations

use german technology in building vishakapatnam : andhrapradesh government planning to rebuilt and renovate vishakapatnam in a fast manner with special focus some people suggests to use german technology to aviod loss from natural effects

ఇలా చేస్తే... సునామి వచ్చినా సురక్షితంగా ఉండవచ్చు

Posted: 10/16/2014 07:10 PM IST
Use german technology in building vishakapatnam

హుద్ హదు్ తుఫానుతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టం విలువ దాదాపు రూ.60వేల కోట్ల నుంచి రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నష్టంను భర్తీ చేసి... తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మూడేళ్లకంటే ఎక్కువ సమయమే పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం వద్ద అంత బడ్జెట్ లేదు. అదేకాకుండా పెద్ద మొత్తం డబ్బులను కేంద్రం ఒకేసారి విడుదల చేయలేదు. కాబట్టి దశలవారిగా మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

‘హుద్ హుద్’ తుఫానుతో గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు వచ్చినా తట్టుకుని నిలవటంపై దృష్టి పెట్టింది. తుఫానులు వచ్చినపుడు బలమైన ఈదురుగాలులు వీచి విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీనికి బదులు భూగర్బ లైన్ ద్వారా విద్యుత్ అందిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. అటు చెట్లు నేలకొరగటంతో పాటు.., నగర అందాలు చాలావరకు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో వేగంగా పెరిగే.., బలంగా ఉండే చెట్లను పెంచుతామని చెప్తున్నారు.

రోడ్లు, టెలిఫోన్, ఇతర కమ్యునికేషన్ రంగాలను కూడా సుస్థిరంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. త్వరలోనే అన్ని రంగాలను గాడిలో పెట్టి.., విపత్తు వల్ల కలిగిన నష్ట నివారణ చర్యలను వేగవంతం చేస్తామని అంటున్నారు. ఈ సందర్బంగా భవన నిర్మాణాలు, ఇతర అంశాలపై పలువురు నిపుణులు ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాల విషయానికి వస్తే.., జర్మనీ టెక్నాలజీతో నిర్మిస్తే ధృడంగా ఉండి విపత్తులను తట్టుకుంటాయని సలహా ఇస్తున్నారు.

ఉదాహరణకు విశాఖలోని నోవాటెల్ హోటల్ నే తీసుకుంటే... ఇది పూర్తిగా జర్మనీ టెక్నాలజీతో నిర్మించబడింది. దీనిలోని ప్రతి గదీ.., పూర్తి భవనం నిర్మాణం విషయంలో జర్మనీ నిపుణుల సలహాల ప్రకారం కట్టడం జరిగింది. అందువల్లే సముద్రతీరానికి కిలోమీటర్ల దూరంలోని ఇండ్లు కుప్పకూలి.., భవనాలు ద్వంసమైనా.., బీచ్ సమీపంలో ఉన్న నోవాటెల్ భారీ భవనం మాత్రం చెక్కుచెదరలేదు. కాబట్టి నిర్మాణం విషయంలో ఇలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో సునామి వచ్చినా సురక్షితంగా ఉంటాయని చెప్తున్నారు.

దీనికి తోడు భూగర్ప లైన్లను వేసే సమయంలో వాటిలో లోపాలు వస్తే తరుచు తవ్వకాలు జరపకుండా.. డ్రైనేజి మ్యాన్ హోల్స్ మాదిరిగా.. అక్కడక్కడా విద్యుత్ లైన్లకు కూడా మార్గాలు ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు. ఇక బీచ్ సమీపంలో భవనాల నిర్మాణం.. ఇతర చోట్ల నిర్మాణాల్లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ముప్పును తగ్గించవచ్చు అని చెప్తున్నారు. వీటికి తోడు టెక్నాలజిని మరింత ఉపయోగించుకుని అందరూ అప్రమత్తంగా ఉంటే ప్రకృతి దాడుల నుంచి తప్పించుకోవచ్చు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hudhud cyclone  buildings  vishakapatnam  latest updates  

Other Articles