Arvind subramanian appointed as india s top economic adviser

Arvind Subramanian, Chief Economic Adviser, narendra modi, budget, indian Economy, Revolutions, oxford university

Arvind Subramanian appointed as India’s Top Economic Adviser

కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుగా అరవింద్..

Posted: 10/17/2014 08:21 AM IST
Arvind subramanian appointed as india s top economic adviser

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి కొత్త జట్టును తీసుకువచ్చింది. ఇంతవరకు ఆర్థిక కార్యదర్శిగానూ, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ జోడు పదవులలో ఉన్న అరవింద్ మాయారాంను అకస్మాత్తుగా పర్యాటక శాఖకు బదిలీ చేసి, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్‌ను ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వచ్చే ఫిబ్రవరిలో పూర్తి స్థాయి బడ్జెటును ప్రవేశపెట్టడానికి మోదీ సర్కారు కసరత్తును మొదలుపెడుతున్న కీలక తరుణంలో ఈ మార్పులు చోటు చేసుకొన్నాయి.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎం.ఫిల్. చదివిన అరవింద్ సుబ్రమణియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్ఎఫ్)లో ఆర్థిక వేత్తగా పనిచేశారు. తన కన్నా ముందు సీఈఏగా ఉన్న రఘురాం రాజన్ మాదిరిగానే సుబ్రమణియన్ కూడా ఐఐఎమ్- అహ్మదాబాద్‌లోనూ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలోనూ చదివారు. రాజన్‌ను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించినప్పటి నుంచి దాదాపు ఒక ఏడాది కాలానికి పైగా సీఈఏ పదవి ఖాళీగా ఉంది.

సీఈఏగా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ, సీఈఏ పదవీబాధ్యతలు నాకు ఇవ్వడం నాకు లభించిన గౌరవం. మార్పునకు, సంస్కరణలకు పెద్ద పీట వేయాలని ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వానికి సేవ చేయడం నన్ను వరించిన అదృష్టం. ఇది ఎన్నో ఆశలు, పురోగతి తత్వం తొణికిసలాడుతున్న తరుణం. సవాళ్లు అనేవి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో ఆశాభావంతో తాను ఉన్నానన్నారు.

శ్రేష్టమైన ఎంపిక: చిదంబరం

ఆర్థిక శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా అరవింద్ సుబ్రమణియన్‌ను నియమించడం వృద్ధికి, సంస్కరణలకు అనుకూలమైన పరిణామం. ఆయన ఎంపిక శ్రేష్ఠమైన ఎంపిక అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles