Intermediate students are in a stage of confusion

Andhra pradesh, Telangana, Government, chief minister, intermediate exams, education minister, jagadeeshwar reddy, Ganta srinivasa Rao, composite course

intermediate students are in confusion stage, on conduction of exams

అయోమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు..

Posted: 10/17/2014 10:57 AM IST
Intermediate students are in a stage of confusion

రెండు రాష్ట్రాల ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తులో ప్రభుత్వాలు అడుకుంటున్నాయి. ఉమ్మడి, వేర్వేరు పరీక్షలకు అదేశిస్తూ.. ఇంటర్ విద్యార్థులను అయోమయంలో పడేస్తున్నాయి. పరీక్షలకు సిద్దం అవ్వాలన్న ఆలోచన పక్కనబెట్టి, తమకు పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వమా..? తెలంగాణ ప్రభుత్వమా..? లేక ఉమ్మడిగా వున్న ఇంటర్మీడియట్ బోర్డా..? అన్నది అర్థం కాక విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. గతంలో మాదిరిగానే ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా, లేదు వేరుగా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించడంతో విద్యార్థులు అయోమక స్థితిలోకి జారుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు వాటి మూల్యంకనం, ఎంసెట్ నిర్వహణ తదితర అంశాలు ముడిపడి వుండటంతో తమ భవిష్యత్ ఎలా వుండోతోందనని విద్యార్థులు ప్రశ్నించుకుంటున్నారు.

ఇంటర్ పరీక్షలను వేరుగానే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను ఆదేశించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు అమోదం లభించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నధమవుతోంది. కేంద్ర న్యాయ శాఖ నుంచి ఆమోదం లభించిందని.. సీఎం కేసీఆర్ ఆమోదం లభించాక త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇంటర్ బోర్డు విభజనతో ప్రస్తుతం వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు సంబంధం లేదని, ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన నిర్వహణ సమస్యలు, ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చిస్తామని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించకపోవడంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ... వెంటనే ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలెట్టాలని అధికారులను ఆదేశించారు. 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు వీలుగా 24 రకాల పేపర్లు రూపొందించాలన్నారు. పేపరు కొనుగోలు, ముద్రణ, అనంతరం సరఫరాకు టెండర్లు పిలవాలని.. 2 రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు వేర్వేరుగా ప్రశ్న, జవాబు పత్రాలను పంపించేలా టెండర్ల నోటిఫికేషన్‌లో స్పష్టం చేయాలన్నారు. ఈ ప్రక్రియకు కనీసం నెల పడుతుందని, ఆ లోగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు పూర్తవుతుందని మంత్రి అన్నారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని కొందరు అధికారులు పేర్కొనగా... ఆ ఉద్దేశమే ఉంటే ఆగస్టు తొలి వారంలో మొదలు కావాల్సిన పరీక్షల పనులను ఇంతవరకూ ఎందుకు ప్రారంభించలేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. అయితే ప్రభుత్వాలు పట్టుదలకు పోవడం పక్కనబెట్టి ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సముచిత నిర్ణయం తీసుకోవాలని పలువురు విద్యారంగ మేధావులు కోరుతున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles