Rahul gandhi visits cyclone effected areas congratulates bjp for winning both state assemblies

Maharastra, BJP, Narendra Modi, modi mania, congress, NCP, Haryana, INLD, Rahul Gandhi, congratulate, BJP, assembly elections

rahul gandhi visits cyclone effected areas, congratulates bjp for winning both state assemblies

ఉత్తరాంధ్ర కన్నీళ్లను పంచుకున్న రాహుల్ గాంధీ..!

Posted: 10/19/2014 10:53 PM IST
Rahul gandhi visits cyclone effected areas congratulates bjp for winning both state assemblies

హుదుద్ తుపాను ధాటికి అతలాకుతలమైన విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్ నేతలు బొత్ససత్యనారాయణ, సి.రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

ముందుగా ఆయన విశాఖ నగరంలో స్టీల్‌ప్లాంట్ కు చేరుకుని కార్మికులతో మాట్లాడారు. తుపాను బీభత్సంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చేలా పోరాడతామని ఆయన భరోసా కల్పించారు. అనంతరం రాహుల్ తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో తుపానుతో అతలాకుతమైన ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులను అడిగి తుఫాను తదనంతర సహాయక చర్యలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తమ పార్టీ బాధితులను పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని తూడెం, కవులవాడ గ్రామాల్లో తుపాను ధాటికి దెబ్బతిన్న కొబ్బరి తదితర పంటలను పరిశీలించి రైతులు, బాధితులను ఓదార్చారు.

బీజేపికి రాహుల్ శుభాకాంక్షలు

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. 'ప్రజా తీర్పును శిరసావహిస్తాం. ఓటర్లు మార్పును కోరుకున్నారు. అందుకే మహారాష్ట్రలో 15ఏళ్లు, హర్యానాలో 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఓడిపోయింది. ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి క్షేత్రస్థాయిలో మరోసారి కాంగ్రెస్ పనిచేయాలి. పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు' అని అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  congress  NCP  Haryana  INLD  Rahul Gandhi  congratulate  BJP  assembly elections  

Other Articles