After lunch a short exercise that will benefit the health

lunch, short exercise, benefit, health, mild exercise, United States, Triglyceride, heart diseases, diet, reduces

After lunch a short exercise that will benefit the health

తిని తొంగుంటే కాదు.. కాసింత వ్యాయామమూ అవసరం..

Posted: 10/24/2014 07:46 AM IST
After lunch a short exercise that will benefit the health

తిని తొంగుంటే మనిషికి గొడ్డుకీ పెద్ద తేడా ఏటుందది..? మనిషన్నాక కాసింత కళాపోషన వుండాలి అంటూ ముత్యాతముగ్గు చిత్రంలో రావుగోపాలరావు చెప్పిన డైలాగు గుర్తుందా..? ఇప్పడు ఆ డైలాగును మన వైద్య పరిశోధకులు మార్చేశారు. మనిషికి గొడ్డుకీ పెద్ద తేడా ఏటుందది..? మనిషన్నాక తినగానే తొంగోడవం కాదు.. కాసింత వ్యాయామం కూడా చేయాలని అంటున్నారు. అనేక అధ్యయనాలు చేసిన తరువాత ఈ విషయాన్ని కనుగోన్నామంటున్నారు వైద్యరంగ శాస్త్రవేత్తలు

భోజనం తర్వాత స్వల్ప వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తాజాగా మరో అధ్యయనం వెల్లడించింది. సరైన భోజనం, సరైన వ్యాయామం మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుందని సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. భోజనం అనంతరం తేలికపాటి వ్యాయామం మంచిదే అంటున్నారు వైద్య రంగ నిపుణులు.

ఇప్పటికే ఈ విషయాన్ని పలు సర్వేలు తెలిపినప్పటికీ తాజాగా అమెరికాలో నిర్వహించిన మరో సర్వే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిపాటి నడక, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని, గుండెకు కూడా మేలు చేస్తుందని వెల్లడించింది. ఎందుకంటే శరీరంలో ట్రైగ్లిసరైడ్ పెరిగిపోతే గుండె సంబంధిత జబ్బులు త్వరగా వస్తాయని, ఆహారం తీసుకున్న తర్వాత స్వల్ప వ్యాయామం చేయడం వల్ల ట్రైగ్లిసరైడ్ స్థాయి మోతాదులో ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lunch  short exercise  benefit  health  mild exercise  United States  Triglyceride  heart diseases  diet  reduces  

Other Articles