Tollywood movie shootings stopped due to labours strike

tollywood movies, tollywood labours, tollywood movies labours, tollywood strike, movie labours strike, tollywood film chambers, tollywood film federations, tollywood producers, tollywood star heroes, balakrishna latest news, pawan kalyan latest news, ram charan latest news, gopichand latest news

tollywood movie shootings stopped due to labours strike

అనుకున్నదొకటి.. అయినదొకటి! ఇంకేంటి పరిస్థితి!

Posted: 10/24/2014 08:51 PM IST
Tollywood movie shootings stopped due to labours strike

ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఒకేసారి 24 విభాగాలకూ చెందిన కార్మికులు బంద్ పాటించడంతో అగ్రహీరోల సినిమాల సైతం ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. సాధారణంగానే చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడు బ్రేకులు పడుతుంటాయి కానీ.. ఈసారి మాత్రం కార్మికుల రూపంలో ఏకంగా పెద్ద బండరాయే అడ్డంగా పడిందని చెప్పుకుంటున్నారు. దాంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సినిమాల షూటింగ్ లు అనుకోకుండా ఆగిపోయాయి. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రవితేజ, గోపీచంద్, నితిన్.. ఇలా ఎందరో అగ్రహీరోల సినిమాల షూటింగ్ లు విరామం తీసుకున్నాయి. దీనికంతటికి కారణం కేవలం కార్మికులు బంద్ పాటించడమే! తిరిగి షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభమవుతాయో, ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి!

బంద్ పాటించడానికి కారణం :

ఇక్కడ ఒక నిఖార్సైన నిజం చెప్పుకోవాలి! అదేమిటంటే... ఒక సినిమాను తీయాలంటే కేవలం హీరో, దర్శకుడు, హీరోయిన్, నిర్మాత, ఇతర నటీనటులు వుంటే మాత్రం సరిపోదు. ఒక సినిమా పూర్తిగా బయటకు రావాలంటే అందుకు 24 విభాగాలకు చెందిన వందలాదిమంది కార్మికులు కలిసి చెమటోడ్చాల్సిందే! తెరవెనుక రాత్రింబవళ్లు వాళ్లు పడే శ్రమ ఎవరి కంటికీ కనిపించదు. తెరముందు కనిపించేవారికంటే.. తెరవెనుక పనిచేసేవారి కష్టమే పదింతలు వుంటుంది. అందుకే.. వాళ్ల శ్రమ మొత్తం దోపిడీ అవుతోందని వాళ్లు భావిస్తున్నారు. సినిమాలకు హీరోలు, దర్శకులు, ఇతర నటీనటులందరూ కోట్లలో పారితోషికాలు తీసుకుంటారు కానీ.. వాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోరని కార్మికులు వాదిస్తున్నారు. అందుకే.. తమ వేతనాలను 50 శాతం వరకు పెంచాల్సిందేనంటూ 24 విభాగాలకు చెందిన కార్మికులు ఒకేసారి బంద్ పాటించారు.

అయితే ఇప్పటికే సినిమా నిర్మాణం తమకు తలకు మించిన భారమవుతోందని, అటువంటి సమయంలో కార్మికుల వేతనాలు 50 శాతానికి పెంచితే తాను నిలువునా మునిగిపోతామని నిర్మాతలు మొత్తుకుంటున్నారు. కానీ తమ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాల్సిందేనని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు - కార్మికుల మధ్య సయోధ్య కుదరకపోతే.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకోవాల్సిన సినిమాలన్నీ మూతపడిపోవాల్సిందే! మరి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కీలకంగా మారిపోయింది.

కార్మికులు - నిర్మాతల వాదనలు :

ఫిల్మ్ చాంబర్ నియమనిబంధనల ప్రకారం సినిమా స్థాయిని, పనిని బట్టి కార్మికులకు రూ.500 నుంచి రూ.1000వరకు నిర్మాతలు వేతనాలు చెల్లిస్తుంటారు. అలాగే డబుల్ షిఫ్ట్, అవుట్ డోర్ పేమెంట్లు కూడా మారుతుంటాయి. అయితే పెరిగిన ధరలు, అవసరాల రీత్యా తమకు ప్రస్తుతమిస్తున్న వేతనాలు సరిపోవడం లేదని.. కాబట్టి తమకు ఖచ్చితంగా 50 శాతం వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు. ‘‘నెలకు 30 రోజులూ షూటింగులు వుండవు. మహా అయితే పదిరోజులపాటు మాత్రమే వుంటుంది. అయినా మేం పనికి తగిన వేతనమే అడుగుతున్నాం’’ అని కార్మికులు వెల్లడిస్తున్నారు. అయితే తాము ఒకేసారి 50 శాతం వేతనాలు పెంచితే నిలువునా మునిగిపోతామని నిర్మాతల వాదన!

ఈ విషయంలో ఫెడరేషన్ కీ, ఛాంబర్ కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. 50 శాతం జీతాల పెంపు సాధ్యం కాదని, 15 శాతం వరకూ పెంచేందుకు కృష్టి చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఒకవేళ కార్మికులు 15 శాతం పెంపునకు అంగీకరిస్తే ఫర్వాలేదు కానీ.. అందుకు అంగీకరించకుండా 50 శాతం కావాల్సిందేనంటూ పట్టుబడితే... సినిమా షూటింగ్ లు ఆగిపోవడమే కాకుండా ఇప్పటివరకు నిర్మాతల చేసిన ఖర్చులు మొత్తం గల్లంతవుతాయి. ముఖ్యంగా అగ్రహీరోల సినిమా నిర్మాతలైతే తమ ఆస్తులను అమ్ముకోవాల్సిందే! ఏదో సినిమాల ద్వారా బిజినెస్ చేసుకుందామని నిర్మాతలు భావిస్తే.. కార్మికుల వేతనాల తలకాయనొప్పిగా మారిపోయాయి. అందుకే.. ప్రస్తుత పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో ‘‘అనుకున్నదొకటి.. అయినదొక్కటి’’ అంటూ చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood news  tollywood movies  tollywood labours strike  pawan kalyan  producers  

Other Articles