Congress chief post to non gandhi person what made sonia gandhi to take this decesion

sonia gandhi, rahul gandhi, Priyanka vadra, chidambaram, congress chief post, non gandhi, responsibilities, arun jaitley, black money, former minister

sonia gandhi may resign congress chief post says chidambaram, to hand over the responsibilities to non gandhi person. What made Sonia gandhi to take this decesion..?

గాంధీయేతర కుటుంబ వ్యక్తికే కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు..?

Posted: 10/25/2014 05:08 PM IST
Congress chief post to non gandhi person what made sonia gandhi to take this decesion

భవిష్యత్తులో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సోనియాగాంధీ కుటుంబానికి చెందని 'గాంధీయేతర వ్యక్తి' కూడా చేపట్టవచ్చని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యాలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణాతరం పార్టీకి బాధ్యతలు బయటి వక్తుల చేతిలోకి వెళ్లింది. ఇక త్వరలో అదే తరహాలో పార్టీ పగ్గాలు మళ్లీ గాంధేతర కుటుంబానికి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయని చిదంబరం అభిప్రాయపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చిన ఒక నవశకం నిర్మాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. అభివృద్దిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆయననే దేశ ప్రజలు భావి ప్రధాతగా ఎన్నుకున్నారు. దేశాన్ని కూడా అభివృద్ది పథంలో పరుగెలెట్టంచాలని కోరుకున్నారు. అందుకు అనుగూణంగానే ఆయన కూడా అధికారం చేపట్టిన ఐదు మాసాల్లోనే మార్పును కనబరుస్తున్నారు. అయితే నరేంద్రమోడీని ఢీ కొనేందుకు కాంగెస్ పగ్గాలు కొత్తవారికి అప్పగించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుందా అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

వరుస పరాజయాలతో కాంగ్రెస్ దేశంలో కొట్టుమిట్టాడుతుంటే.. అటు వైరిపక్షం, అధికర పక్షమైన బీజేపి మాత్రం ఎక్కడికక్కడ ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. మోడీ మానియా పనిచేస్తుందా అన్న ప్రశ్నలకు ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి. మోడీ మానియా మసకబారిందన్న విమర్శలకు అవి గట్టి సమాధానాన్ని చెప్పాయి. గుజరాత్ తరహాలోనే ఇక దేశంలోనూ మోడీ తన సత్తాను చాటుకుంటూ మరో రెండు మూడు పర్యాయాలు ప్రధానిగా కొనసాగితే..120 ఏళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ భవితవ్యమేమిటి.. ఆ పార్టీలో ఎవరు కొనసాగుతారు..? అసలు పార్టీ ఉనికికే ముప్పు పొంచివుందన్న ప్రమాదఘటికలను కాంగ్రెస్ అధిషానం ముందుగానే దృష్టి సారించింది

ఇప్పటికైతే దేశంలో సార్వత్రిక ఎన్నికలు లేవు, ఎన్నికలకు ఇంకా సుమారుగా నాలుగున్నరేళ్ల సమయం పడుతుంది. మరోవైపు గత రెండు సంవత్సరాల కాలంగా జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇదే ఇక ముందు కూడా కొనసాగితే.. తమ పరిస్థితి ఏమిటీ అన్న అంధోళన పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ మనుగడకే కష్టకాలం రావడం కన్నా ముందే తేరుకుంటే మంచిదన్న అభిప్రాయంతోనే పార్టీ పగ్గాలు గాందీయేతర కుటుంబాలకు అప్పగించనున్నారా అన్న వాదనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో రాహుల్ పై విమక్షాల విసుర్లు మరింతగా పెరిగిన తరుణంలో రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా.. పక్కకు తప్పించి. గాంధీ యేతర కుటుంభ వ్యక్తిని కూర్చెబెట్టి అతనిపైనే పార్టీ బరువుభాధ్యలన్నీ వేస్తే రాహుల్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ అలానే వుంటుందని అది భవిష్యత్ లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తునట్లు సమాచారం. వరుస ఓటమిల నేపథ్యంలో పార్టీ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని.. కొత్త వ్యక్తికి పగ్గాలను అప్పగించిన తరువాత కూడా పార్టీ ఓటమి పాలైతే.. అప్పడతనిపై చర్యలు తీసుకోవచ్చని, దీంతో అటు పార్టీ బలోపేతం కావడంతో పాటు వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీని తీసుకురావచ్చునని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు ఆయనను పక్కనబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

దరిదాపుల్లో ఎన్నికలే లేని సమయంలో హఠాత్తుగా గాంధీ యేతర కుటుంబవ్యక్తి పార్టీ పగ్గాలను అప్పగించాలని.. అందులోనే పార్టీ సీనియర్ నేత, మేధాయైన చిదంబరం ఈ విషయాన్ని బయటపెట్టడంతో..అనుమానాలకు అస్కారమిస్తున్నాయి. తాజాగా అరుణ్ జైట్లీ చేసిన నల్లధన కుబేరుల జాబితా వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మార్పలు జరగడం కూడా సందేహాలకు తెరతీస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా ఈ జాబితాలో వుందని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో జాబితా బయటపడిన తరువాత అధినేత్రి స్థానం నుంచి తప్పుకోవడం కన్నా, అంతకు ముందుగానే తప్పుకుంటే తన ప్రతిష్టకు పెద్దగా భంగం వాటిల్లదని సోనియాగాంధీ యోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకనే కాకతాళియంగానో, యాధృఛికంగానో చిదంబరం లాంటి మేధావి నోట కూడా మనోదైర్యం అనే పదం వచ్చింది. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థుతులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్న నేత చిదంబరం ఆయనే బ్లాక్ మనీ జాబితాలో కాంగ్రెస్ నేత పేరు ఉందన్న ఆరోపణలతో పార్టీ మనోధైర్యం బాగా దెబ్బతిందని అభిప్రాయపడ్డటం కూడా ఇబ్బందికర పరిణామనేనని చెప్పాలి.

అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌లో అత్యుత్తమ నాయకత్వం అందిస్తున్నవారిలో నెంబర్ వన్ సోనియాగాంధీయేనని చిదంబరం సన్నాయి నోక్కులు నోకారు. ''ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో స్త్థెర్యం కాస్త తక్కువగానే ఉంది. దీనిని నాయకత్వం పెంచాల్సి ఉంది. పార్టీని పునర్‌వ్యవస్థీకరించి బలమైన ప్రతిపక్షంగా మలచాలన్నారు కాంగ్రెస్‌లో తన తరంవారికి అత్యంత ఆమోదయోగ్యమైన నేత సోనియాగాంధీ అయితే.. యువనాయకత్వంలో ఆ స్థానం రాహుల్‌గాంధీదేనని చెప్పారు. దీనిఅర్థం ఇతర నాయకులు ఆవిర్భవించరని కాదని వివరణ ఇచ్చారు. పెత్తనం పేరుకే ఇచ్చి కర్ర మాత్రం తన చేతిలనే పెట్టుకునేలా వ్యవహరిస్తే.. గత ప్రభుత్వ పాలనలో ఎదర్కోన్న అనుభవాలనే పార్టీలోనే ఎదుర్కోవాల్సి వస్తుందని, అదే జరిగితే.. పార్టీ మనుగడకే ప్రమాదకర పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు. ఇంతకీ ఎప్పటికీ కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబేతర వ్యక్తులకు అందేనో వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles