Bjp will contest on its own strength in the assembly polls says bjp national vice president raghubar das

Election Commission, announcement, dates, assembly elections, bjp, jharkhand, rajnath singh, narendra modi, Amit shah, Raghubar Das, Yashwanth sinha

BJP will contest on its own strength in the assembly polls, says BJP national vice president Raghubar Das

జార్ఖండ్ లో ఒంటరిపోరుకు సిద్దమైన బీజేపి

Posted: 10/26/2014 05:10 PM IST
Bjp will contest on its own strength in the assembly polls says bjp national vice president raghubar das

జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించగానే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీకి చేసేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుంది. జార్ఖండ్‌లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘబార్ దాస్ మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ విషయం రూడీ అయ్యిందని ఆయన తెలిపారు.

మరో బిజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సైతం పోత్త లేదన్న సంకేతాలను ఇచ్చారు. ప్రజలు తమ వైపు వున్నప్పుడు తామెందుకు పోత్తు పెట్టుకోవాలని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో మోడీ హావా వీస్తున్నదని, జార్ఖండ్ అసెంబ్లలో తాము అధికారంలోకి రావడానికి అది దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పూర్తి మెజారీటీ సాధిస్తుందని కూడా యశ్వంత్ సిన్హా  విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 14 స్థానాలకుగాను 12 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యేలా చూడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోడీతో పదిహేను నుంచి ఇరవై ర్యాలీలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచిస్తుంది. బీజేపి అధికారంలోకి రావడం సాధ్యం కాని రాష్ట్రాలలోనూ అధికారాన్ని కైవసం చేసుకున్న ధీమా బీజేపి శ్రేణులకు మంచి ఊపునిస్తోంది. దీంతో ఇక రానున్న అన్ని ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపాలని బీజేపి అధినాయకత్వం కూడా భావిస్తుందని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles