Attack on bilawal bhutto in london

attack on bilawal bhutto, bilawal attacked in london, bilawal bhutto london speech, bilawal bhutto on kashmir, bilawal bhutto on india, bilawal bhutto latest updates, pakistan latest updates, kashmir seperate movement

attack on bilawal bhutto in london : pakistan people's party president bilawal bhutto attacked with eggs and water bottles in london when he ready to talk on kashmir issue.

అయ్యో..! బిలావల్ భుట్టో కు ఘోర పరాభవం !!

Posted: 10/27/2014 11:19 AM IST
Attack on bilawal bhutto in london

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టోకు ఘోర అవమానం జరిగింది. ఆయన ఎంచుకున్న కాశ్మిరీ అంశమే భుట్టోను అవమానించేలా చేసింది. ఈ మద్య ఎక్కడ కన్పించినా కాశ్మిర్ అంశాన్ని ప్రస్తావిస్తున్న భుట్టో లండన్ లో కూడా ఇదేవిధంగా వ్యవహరించబోయి చేయి కాల్చుకున్నారు. కాశ్మీర్ వివాదం కోసం అంతర్జాతీయ సమాజం సహకరించాలన్ని డిమాండ్ తో ‘మిలియన్ మార్చ్’ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలతో పాటు భుట్టో కూడా పాల్గొన్నారు.

మిలియన్ మార్చ్ కు వచ్చిన ప్రజలను ఉద్దేశ్యించి భుట్టో ప్రసంగం మొదలు పెడుతుండగానే.., ఆయనపై కోడిగుడ్లు.., టమోటాలు, వాటర్ బాటి్ళ్ళు వచ్చి పడ్డాయి. కాశ్మిర్ గురించి మాట్లాడేటపుడు ఇక్కడ నీకేం పని’ అని నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో ఏమి మాట్లాడకుండానే కార్యక్రమం అర్దాంతరంగా ముగించేసి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ నడిబొడ్డున ఉన్న డౌనింగ్ స్ర్టీట్ టఫాల్గర్ స్వ్కేర్ లో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించి పలువురు ఆందోళనకారులను పోలిసులు అరెస్టు చేశారు.

కొద్దికాలంగా భుట్టో భారత్ కు వ్యతిరేకంగా కామంట్లు చేస్తున్నారు. కాశ్మీర్ లో ఇంచు భూమి కూడా వదలబోమని ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి కూడా భుట్టో రెచ్చిపోయి మాట్లాడారు. అయితే ఇదంతా పాకిస్థాన్లో కావటంతో చెల్లింది. అదే ఇతర దేశాల్లో అయితే ఏమవుతుందో ఇప్పుడు చూశారుగా. ఇకపై కాశ్మీర్ గురించి మాట్లాడాలంటే భుట్టోకు పైనుంచి కిందివరకు వణుకుపుట్టడం ఖాయం అంటన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bilawal bhutto  attack  london  kashmir  

Other Articles