Kanna lakshmi narayana joins bjp party

kanna lakshmi narayana, congress leader, former central minister, bjp party news, kanna lakshmi narayana joins bjp party

kanna lakshmi narayana joins bjp party

బీజేపిలో చేరిన కన్నా లక్ష్మినారాయణ

Posted: 10/28/2014 05:11 PM IST
Kanna lakshmi narayana joins bjp party

మాజి మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మినారాయణ బీజేపీలో చేరారు. ఢిల్లీకి వెళ్లిన కన్నా..., పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పకున్నారు. అయితే ఈ విషయాన్ని చివరి వరకు కన్నా సన్నిహితులు రహస్యంగా ఉంచారు. సీమాంధ్రలో కనీసం ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మాజిమంత్రి చేరికపై చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా స్పందించేందుకు మాత్రం ఆయన ముందుకు రాలేదు.

తెలంగాణ ఉద్యమం సమయంలో కిరణ్ పై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నాను సీఎం చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించారు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నాలక్ష్మినారాయణకు జిల్లాలో రాయపాటితో వర్గ విభేదాలున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాయపాటి టీడీపీలో ఉండగా... ప్రస్తతం కన్నా తెలివిగా కమలదళంలో చేరారు. రెండు మిత్ర పక్షాలుగా ఉన్పప్పటికి ఎవరి రాజకీయ అవసరాలు వారివి. కాబట్టి సీమాంధ్రలో బలం కోసం చూస్తున్న బీజేపికి కన్నా చేరిక రాజకీయంగా, సామాజిక వర్గ సమీకరణ పరంగా ప్లస్ అవుతుంది. అటు కాంగ్రెస్ నావ ప్రయాణం లేని సమయంలో బీజేపీలో చేరి కన్నా కూడా తన తెలివిని ప్రదర్శించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanna lakshmi narayana  bjp party  congress party  

Other Articles