21 year old girl named vineela came out from death

21 year old girl vineela, girl dead, Cremation ground, girl came out from Cremation ground, tamilnadu incident, girl came out from death

21 year old girl named vineela came out from death in tamilnadu

మరణించిన యువతి ప్రాణాలతో తిరిగొచ్చింది..!

Posted: 10/28/2014 07:59 PM IST
21 year old girl named vineela came out from death

కొన్నినెలలక్రితం ఒక అమ్మాయి కనిపించకుండాపోయింది... ఆమెకోసం దర్యాప్తు చేస్తే తీరా శవమై తేలింది... దీంతో ఆమె కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది... ఇక చేసేదేమీలేక మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేసేశారు... చేతికి వచ్చిన తమ కూతురు బలైపోయిందే అంటూ ఆమె తల్లిదండ్రులు ఆవేదనతో కుమిలిపోయారు. ఇలా కొన్నాళ్లపాటు సాగిన తర్వాత అనుకోకుండా ఆ అమ్మాయి ప్రాణాలతో తిరిగొచ్చి అందిరినీ ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. మొదట్లో ఆమెను చూసి దెయ్యమంటూ భయపడ్డారుగానీ.. తర్వాత తమ యువతేనంటూ నిర్ధారించుకున్నారు. ఇటువంటి సంఘటనలు చాలావరకు సినిమాల్లోనే జరుగుతాయి... కానీ ఇక్కడ మాత్రం నిజజీవితంలోనే జరిగింది.

తమిళనాడు పుడుకొట్టైకి చెందిన వినీల (21) అనే యువతి ఇంట్లోవారికి తెలియకుండా అదృశ్యమైంది. ఆమెకోసం తల్లిదండ్రులు ఎంత వెతికిన ఆచూకీ లభ్యంకాకపోవడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకోసం గాలింపు చర్యాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి ఓ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం మిస్సయిన వినీలదేమోననే అనుమానంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిపించారు. అయితే ఆ మృతదేహం అంతగా గుర్తుపట్టేంతగా లేకపోవడం కారణంగా దానిని చూసిన తల్లిదండ్రులు తమ కుమార్తె వినీలనే అనుకున్నారు. దీంతో ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.

కొన్నినెలలు గడిచిన తరువాత అనుకోకుండా సడెన్ గా వినీల ప్రాణాలతో తన ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులతోపాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అంత్యక్రియలు చేసినా తమ కూతురు ఎలా తిరిగొచ్చిందోనంటూ భ్రమలోనే వుండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తరువాత తల్లిదండ్రులకు అప్పగించేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. న్యాయస్థానంలో ఈమెను ప్రవేశపెట్టినప్పుడు ‘‘ఇల్లు ఎందుకు వదిలిపెట్టావు?’’ అని ప్రశ్నిస్తే.. ‘‘తన తల్లిదండ్రులు పెళ్లి చేయని కారణంగా వెళ్లాను’’ అంటూ యువతి బదులిచ్చింది. ఇదీ! అసలు విషయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu latest news  21 year old girl vineela  cremation ground  

Other Articles