రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తులో అడుకుంటున్నాయి. ఉమ్మడి, వేర్వేరు పరీక్షలకు అదేశిస్తూ.. ఇంటర్ విద్యార్థులను అయోమయంలో పడేస్తున్నాయి. పరీక్షలకు సిద్దం అవ్వాలన్న ఆలోచన పక్కనబెట్టి, తమకు పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వమా..? తెలంగాణ ప్రభుత్వమా..? లేక ఉమ్మడిగా వున్న ఇంటర్మీడియట్ బోర్డా..? అన్నది అర్థం కాక విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. గతంలో మాదిరిగానే ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా, లేదు వేరుగా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించడంతో విద్యార్థులు అయోమక స్థితిలోకి జారుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు వాటి మూల్యంకనం, ఎంసెట్ నిర్వహణ తదితర అంశాలు ముడిపడి వుండటంతో తమ భవిష్యత్ ఎలా వుండోతోందనని విద్యార్థులు ప్రశ్నించుకుంటున్నారు.
మరోవైపు ఇంటర్ పరీక్షలపై ఏదో ఒక నిర్ణయం తేల్చిచెప్పాలని.. ఇంకా ఆలస్యం చేస్తే మార్చిలో నిర్వహించాల్సిన పరీక్షల్ని వాయిదా వేయక తప్పదని ఇంటర్ బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హెచ్చరించడం కూడా విద్యార్థులను కలవరానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి బోర్డు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ''విభజన ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు, వివరణలతో ఇప్పటికే ఈసారి పరీక్షల నిర్వహణ ప్రక్రియలో నెలరోజులు వెనకబడ్డామని తేల్చి చెప్పినా. ప్రభుత్వాలు మాత్రం తమ బెట్టు వీడటం లేదు. ప్రశ్నపత్రాల సెట్లను ప్రింటర్‌కు అందివ్వటంలో ఇంకా జాప్యం చేస్తే పరీక్షల ముందస్తు ప్రక్రియంతా దెబ్బతిని... పరీక్షల్ని వాయిదా వేయక తప్పదని కూడా బోర్డు అధికారులు హెచ్చరించారు.
వీటి ఫలితంగా జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రయత్నించే రెండు రాష్ట్రాల్లోని లక్షలాది విద్యార్థుల ఆకాంక్షలు దెబ్బతినే ప్రమాదముందని బోర్డు అధికారులు చెప్పినా రెండు ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం తీసుకోవడంలో తాత్సరం చేస్తున్నారు. దీంతో విద్యార్థులల్లో ఆందోళన పెరుగుతోంది. ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; విడివిడిగానే జరపాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నాయి. తమ వాదనలకు మద్దతుగా ఎవరికివారు కారణాలు వారికి వున్నా.. లక్షలాధి మంది విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవడం సమంజసం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడ్డుతున్నారు.
ఇంటర్ పరీక్షలను వేరుగానే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే ఎంసెట్ వెయిటేజీ మార్కులు, ఓపెన్ క్యాటగిరిలో ప్రవేశాలలో ఇది ప్రతిబంధకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాగో వచ్చే ఏడాది నుంచి ఎవరి పరీక్షలు వారే నిర్వహించుకునే అవకాశాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచే నిర్వహిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెబుతోంది. రెండు రోజుల క్రితం సుమారు ఐదు గంటల పాటు సాగిన ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల భేటీ కూడా ఏటూ తెలకుండానే ముగియడంతో విద్యార్థులు డోలయమానంలో పడ్డారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు జరుగుతాయా..? ఎవరు నిర్వహిస్తారు.? ఎంసెట్ ప్రవేశాలలో తమ వెయిటేజీ మార్కులకు ఎలా న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలతో విద్యార్థులు అయోమయంలో వున్నారు. ఇప్పటికైనా ఇరు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రలు.. ఒక నిర్ణయానికి రావాలని, తమకున్న అనుమానాలన్నీ పటాపంచలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ అమూల్యమైన భవిష్యత్ తో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకోవద్దని వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు బెట్టువీడి తమలో రేగుతున్న సందేహాలన్నింటినీ తుడిచివేయాలని అభ్యర్థిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more