అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల. హైందవులకు పవిత్ర పుణ్యక్షత్రం. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోలువైన శ్రీవారి సన్నిధిలో భధ్రతా లోపం మరోమారు చర్చనీయాంశంగా మారింది. భక్తి ప్రవర్తులతో శ్రీవారిని ఆరాధించే చోట.. అన్యమత ప్రచారం తెరతీసింది. శ్రీవారికి ఆమడ దూరంలోనే అన్యమత ప్రచారానికి వీడియోతో సిద్ధపడిన ఒక ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తిరులమ శ్రీ వేంకటేశ్వరుని కేవలం ఒక రాతిబొమ్మ అని అభివర్ణిస్తూ, పవిత్ర భక్తి భావంతో శ్రీవారిని కొలుస్తున్న అశేష భక్త కోటిని మనోభావాలను గాయపర్చాడు. అంతే కాదు శ్రీవారి భక్తులను పాపాత్ములు అని సంబోధిస్తూ ఆ వ్యక్తి వీడియో తీసి అమెరికాకు పంపించాడు.
|ఆ వ్యక్తి అమెరికాకు పంపించిన వీడియాలో తిరుపతిలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని పేర్కొంటూ భక్తులు నిస్సహాయ స్థితిలో వేలాదిగా ఇక్కడికి వస్తుంటారని, వారిని హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మార్చి వారిని దైన్య స్థితినుంచి విముక్తి చేస్తానని సుధీర్ అని తనను తాను పాస్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి చెపకున్నాడు. ఇందుకు అమెరికావంటి దేశాలనుంచి అతడు పెద్ద ఎత్తున నిధులు కూడా కోరుతూ తిరుపతి మొత్తాన్ని పెద్ద క్రైస్తవ ప్రాంతంగా మార్చేస్తానని కూడా ఆ వ్యక్తి ఈ వీడియోలో విజ్ఞప్తి చేశాడు.
ఇమ్యానుల్ బాప్టిస్టుకు చెందినట్టు చెప్పకున్న ఈ వ్యక్తి అలిపిరిలో కారులో తన ప్రయాణం ఆరంభించి ఆనంద నిలయం వరకూ ప్రయాణించాడు. మధ్యమధ్యలో అతడు కారు దిగి క్రైస్తవ ప్రార్థనలు కూడా చేశాడు. ఒక చోట ఆ వ్యక్తి కంబళి కపకున్న ఒక భక్తుని భుజంపై చెయ్యి వేసి ఈ వ్యక్తి పేదరికంలో ఉన్నాడు, అతను సాంత్వనం కోరుకుంటూ తిరుమల వచ్చాడు, కాని అతడు కోరుకున్న సంతోషం అతనికి దొరకలేదంటూ ఈ వ్యక్తి తన బోధనలు విని అప్పటికపడు మతం మార్చుకున్నాడని పాస్టర్ ఆ వీడియోలో చెపకొచ్చాడు. దానిని అమెరికాకు పంపించాడు. తనకు డబ్బును పంపిస్తే త్వరలోనే తిరుమలను చర్చిగా మారుస్తానని పాస్టర్ వీడియోలో ధీమా వ్యక్తం చేశారు. సుమారు అరగంట నిడివి గల ఈ వీడియోను తీయాలంటే..కనీసం గంట నుంచి రెండు గంటల పాటు సమయం పడుతుంది. ఇంత సేపు అన్యమత ప్రచారకుడు.. బహిరంగంగా శ్రీవారిని దూషిస్తూ, ఆయన భక్తులను మతమార్పిడి ప్రోత్సహిస్తుంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అమెరికాలో స్వామివారి భక్తులు యూట్యూబ్‌లో ఈ వీడియోను చూసి తిరుమలలో సాక్షాత్తూ స్వామి వారి సమక్షంలోనే ఇంత దారుణం జరుగుతుంటే టిటిడి సిబ్బంది, అక్టోపస్, విజిలెన్స్ అధికారులూ ఏం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం ఇంత బాహాటంగా జరుగుతున్నా.. హిందువుడైన భక్తుడిని మత మార్పిడి చేస్తానని సుధీర్ అనే పాస్టర్ చెబుడుతున్నా అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తిరుమలలో భక్తుల, భక్తులు మనోభావాలకు భద్రత కరువైందని విమర్శలు వస్తున్నాయి. కలియుగ దైవాన్ని దూషించే పాపానికి ఒడిగట్టి, తిరుమలను త్వరలోనే చర్చిగా మారుస్తానన్న పాస్టర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. తన స్వార్థం కోసం కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాలతో అడుకుంటూ వీడియోను చిత్రీకరించి అమెరికాకు పంపిన పాస్టర్ ను కటకటాల వెనక్కి నెట్టారు.
సాధారణంగా తిరుమల వచ్చే భక్తులు ఘాట్ రోడ్డుపై వస్తూ కెమేరాలతో ఫొటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. వీటిపై నిషేధం లేదు. స్వామిని దర్శించుకోవడానికి వెళ్లడానికి ముందు క్యూలో నిల్చున్న ప్రాంతం నుంచి కెమేరాలు తీసుకువెళ్లడానికి గాని, ఫోన్లు తీసుకువెళ్లడానికి గాని అనుమతి లేదు. అయినా సుధీర్ వీడియోను తీసుకెళ్లడంపై సందేహాలు కలుగుతున్నాయి. తిరుమలలోని కొందరు అధికారులే అన్యమత ప్రచారానికి సహకరిస్తున్నారా..? అన్న సందేహాలు రేకెత్తున్నాయి. ఇప్పటికైనా.. పరమపవిత్రం. ఆథ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ఏడుకొండలపై అన్యమత ప్రచారం జరగకుండా నిలవరించే చర్యలను అధికరాలు చేపట్టాలని హైందవ భక్తులు కోరుతున్నారు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more