Devendra fadnavis takes oath as maharashtra chief minister

maharashtra chief minister, oath taking, wankhede stadium, chief minister Devendra Fadnavis, RSS, Eknath Khadse, Nitin Gadkari

devendra fadnavis takes oath as maharashtra chief minister

మరాఠ పాలనా పగ్గాలను చేపట్టిన విదర్భ దేవేంద్రుడు..

Posted: 10/31/2014 08:48 PM IST
Devendra fadnavis takes oath as maharashtra chief minister

మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు.

దేవేంద్రుడికి ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు

న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించిన దేవేంద్ర పెడ్నవిస్ కు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు బాగానే వున్నాయి. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కుడంలో తెరవెనుక కథను నడిపించినందా రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ పరివారమే. ముఖ్యమంత్రి పదవికి రేసులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో పాటు ఏక్ నాథ్ ఖాడ్సే వంటి నేతలు బరిలో వున్నా.. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతోనే దేవేంద్ర ఫెడ్నవిస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకానోక దశలో నితిన్ గడ్కరీయే ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు హల్ చల్ చేశాయి. విదర్భ గడ్డలో తన వర్గం శాసనసభ్యులతో బలం నిరూపించుకున్న నితిన్ గడ్కారీకి ఒకానోక ధశలో ఎన్సీపీ కూడా మద్దతు పలికింది. ఆయననే ముఖ్యమంత్రిగా నియమించాలని కోరింది. ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుందని బీజేపి వర్గాలు కూడా భావించాయి. అయితే ఇప్పటి వరకు రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో వున్న ఫెడ్నవిస్ వైపే అర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ మాత్రం ఫెడ్నవిస్ వైపే మొగ్గు చూపారు.. సీనియారిటీతో పాటు అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వెనుకబడిన తరగతులకు చెందిన తనకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని ఇవ్వాలని సీనియర్ బీజేపీ నాయకుఃడు ఏక్ నాథ్ ఖాడ్సే విన్నవించినా.. ఆర్ఎస్ఎస్ వినిపించుకోలేదు. తనలాంటి వారిని పక్కన బెడితే.. రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని కూడా చెప్పినా.. ఆర్ఎస్ఎస్ ఫెడ్నవిస్ వైపునే నిల్చుంది. కాగా, బ్రాహ్మణ వర్గానికి చెందిన నితిన్ గడ్కారీ, పడ్నవిస్ లు ఇద్దరు తమ ఆర్ఎస్ఎస్ కుటుంబానికి చెందినవారే. అయితే గడ్కరీ అవసరం దేశ రాజకీయాలలోకి చాలా అవసరమని నచ్చజెప్పడంలో ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు ఫలించడం దేవంద్రుడికి ముఖ్యమంత్రి పదవిని అందించింది. బీజేపి వ్యవహారాల్లో తమ జోక్యం వుండదని కుండబద్దలు కోట్టే ఆర్ఎస్ఎస్.. అవసరం వచ్చినప్పుడల్లా.. అక్కడ వాలిపోతుంటుంది. నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేయడం దగ్గర నుంచి పెడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా చేయడం వరకు ఆర్ఎస్ఎస్ తన ప్రభావాన్ని చాటుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles