Gk vasan quits congress and starts tamil maanila congress

tamilnadu congress latest, tamilnadu congress closing, congress party latest, gk vasan new party, gk vasan quits congress, gk vasan new party, tamil maanila congress party latest news, tamilnadu politics, latest news

congress party chapter going to close in tamilnadu : historical congress party going to close in tamilnadu with recent consequences. congress party tamilnadu main leader of the party g.k. vasan came out from party and going to rebuild his father party tamil maanila congress

తమిళనాట కాంగ్రెస్ దుకాణం బంద్

Posted: 11/03/2014 01:45 PM IST
Gk vasan quits congress and starts tamil maanila congress

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరినట్లు కన్పిస్తోంది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజి కేంద్రమంత్రి జీ.కే. వాసన్ పార్టీ వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. త్వరలోనే కొత్త పార్టీ పగ్గాలు చేపడుతామన్నారు. తన తండ్రి జీ.కే. మూపనార్ 1996లో స్థాపించిన తమిల్ మానిళ కాంగ్రెస్ పార్టీని తిరిగి మొదలు పెట్టి.., పునర్వైభవం తీసుకువస్తానని వాసన్ చెన్నైలో మీడియాకు తెలిపారు. కొత్త రాజకీయ విధానాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. హస్తం పార్టీ విధానాలు, కార్యాచరణ, లక్ష్య సాధన తమిళ ప్రజలకు లాభం కల్గించకపోవటం వల్లే ఆపార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు వివరించారు.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 47ఏళ్ళుగా అధికారంలో లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నయ అవసరం ఉందని గుర్తించి బయటకు వచ్చాము అని మీడియాకు వివరించారు. లక్ష్యాలను సాధించేందుకు కొత్త విధానాలు అవలంభిస్తామన్నారు. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ జ్ఞానదేశిగన్ కు మద్దతు పలుకుతున్న వాసన్.., దేశిగన్ పార్టీ పదవికి రాజీనామా చేస్తే కనీసం పట్టించుకోకుండా ఇళన్ గోవన్ ను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిని చేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పార్టీ నియంతృత్వ, ఏకపక్ష విధానాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పరిణామంతో తమిళనాట కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. రాష్ర్టంలో పార్టి తరపున ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటివరకు ముగ్గురు వాసన్ వైపు వచ్చారు. మిగతా ఇద్దరూ వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ ఎమ్మెల్యేల దుకాణం ఖాళీ అయినట్లే లెక్క. 128 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రాష్ర్టంలో ఏమి చేయాలో పాలుపోకుండా ఉంది. నాయకత్వం ఉన్నప్పటికీ.. శాసనసభ ప్రాతినిధ్యం లేకపోవటంతో సభలో గళం విన్పించే అవకాశం ఉండదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  tamil nadu  gk vasan  politics  

Other Articles