Hands in boiling oil indian chef fries fish with bare hands

Hands In Boiling Oil: Indian Chef Fries Fish With Bare Hands

Hands In Boiling Oil: Indian Chef Fries Fish With Bare Hands

అవి చేతులేనా..? మరుగుతున్న నూనెలో పెట్టినా కలవా..?

Posted: 11/06/2014 06:35 PM IST
Hands in boiling oil indian chef fries fish with bare hands

మనం స్నానం చేస్తున్పప్పుడు పరద్యానంలోకి జారుకుని కాస్త వేడిగా వున్న నీళ్లు వంటిపై పోసుకోగానే అబ్బో మంట, అమ్మో మంట అని అరచి గోళ గోళ  చేస్తాం. ఇక ఇంట్లో వాళ్లు మనకు సపర్యలు చేయలేక ఇబ్బందులు పడతారు. కానీ వేడి వేడి గా మరుగుతున్న నూనే వంటిపై పడితే ఎలా వుంటుంది. కనీసం ఊహించడానికే ఇబ్బందిగా వుంది కదూ. కానీ ఇక్కడ ఓ పెద్దాయన తన చేతులను వేడి వేడిగా మరుగుతున్న నూనేలో చేయి పెడుతున్నాడు. ఒక్క సారి కాదు చాల సార్లు.. కానీ అతని చేతులకేం కావడం లేదు. కనీసం అతను తన చేతులు కాలుతున్నాయని కూడా అనడం లేదు. చేతులకు కనీసం మంట కూడా లేదంటున్నాడు.. అదెలా సాధ్యం.. మరుగుతున్న నూనెలో చెయ్యిపెట్టాక, కాలకపోతే ఏమవుతుంది..? చర్మం వూడి రాకపోతే.. ఎలా కుదురుతుందనేగా మీ అనుమానం...

అది ఢిల్లీలోని పాత నగరం వెనుక వైపున వున్న వీధులో విచిత్రమే అది. అక్కడ ప్రేం సింగ్ అనే వ్యక్తి తన తండ్రి పెట్టిన చేపల ఫ్రై దుకాణంలో విక్రయాలు జరుపుతుండేవాదు. ఈ దుకాణం 200 డిగ్రీల వేడితో సలసల కాగుతున్న నూనెలో చేపలను వేయించి. ఫ్రై చేసిన తరువాత దానిని అమ్ముతుంటారు. ఒక రోజు అనుకోకుండా అతను చేపలను వేయించాడు. నూనెలో చేయి పెట్టాడు. అయితే అతని చెయ్యి కాలలేదు.  మరోసారి నూనెలో చెయి పడింది కానీ కాలనే లేదు, మంటా లేదనుకుని ఇది నిజమా.? లేక భ్రమ అని మరోమారు ప్రయత్నించాడు. రెండోసారి కాలకపోవడంతో అతనికి నిజమని భావించాడు.

ఇప్పడు తన ఇద్దరు కుమారు విక్రయాలు జరుపుతుంటే తాను మాత్రం చేపలను నూనెలో ఫ్రై చేయిస్తుంటాడు. అతని పేరు ఫ్రేం సింగ్. అతని దుకాణానికి వచ్చిన పలువురు కస్టమర్లు అతనిని నూనెలో చేయి పెట్టమని మరీ కోరుతుంటారట. అతను నూనెలో చెయి సెటితేనే చేపలను తీసుకెళ్లే వాళ్లూ వున్నారట. అయితే అంత వేడిగా వున్న నూనెలోంచి ప్రేం సింగ్ ఓట్టి చేతులతో చేప ముక్కల్ని బయటకు తీస్తుంటాడు. ఈ ప్రయత్నంలో తనకు ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదని, తానెప్పుడు అనారోగ్యం బారిన పడలేదని ప్రేం సింగ్ తెలిపాడు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boiling oil  indian chef  fish frying in oil  hands in boiling oil  

Other Articles