Woman sells her mangalsutra for toilet in maharasthra

mangalsutra sell for toilet, indian toilet, indian open toilets, women toilet in india, woman sell mangalsutra for toilet, latest news, maharasthra latest news

woman sells her Mangalsutra for toilet in maharasthra : a woman in maharasthra saikheda village for selling her mangalsutra for toilet for her house. pankaj munde praised woman who sold her mangalsutra for building toilet

టాయ్ లెట్ కోసం తాళిబొట్టు అమ్మేసింది

Posted: 11/06/2014 08:30 PM IST
Woman sells her mangalsutra for toilet in maharasthra

మరుగుదొడ్డి అవసరాన్ని ప్రస్తుత తరం మహిళలు గుర్తిస్తున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే అత్తవారింట అడుగు పెట్టాలంటే కుటుంబం మంచిది కాదా అని విచారించటంతో పాటు మరుగుదొడ్డి ఉందా.. లేదా అని చూస్తున్నారు. టాయ్ లెట్ అవసరం గుర్తించిన ఓ మహిళ ఏకంగా తన తాళిబొట్టు అమ్మేసి మరుగుదొడ్డి నిర్మించుకుంది. మహారాష్ర్టాలోని వషిం జిల్లా సాయిఖేదా గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే సంగీత అహ్వాలే ఇంట్లో మరుగుదొడ్డి లేక చాలా ఇబ్బందులు పడింది.

కట్టించుకోవాలని కోరిక ఉన్నా అయితే డబ్బు లేకపోవటంతో సాధ్యపడలేదు. కాని ఎలాగైనా ఇబ్బందిని అధిగమించాలని భావించి, మహిళలు ప్రాణప్రదంగా భావించే తాళిబొట్టును కూడా అమ్మేందుకు సిద్ధపడింది. మంగళసూత్రం అమ్మేసి వచ్చిన డబ్బుతో టాయ్ లెట్ కట్టించుకుంది. ఈ విషయంపై స్థానికులు కొందరు వద్దని సలహా ఇచ్చినా.., తనకు తాళిబొట్టు కంటే టాయ్ లెట్ ముఖ్యమని తెగేసి చెప్పింది. ఈ విషయం స్థానికంగా ఉండే మహిళా సంఘాల కార్యకర్తల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది.

వివాహ బంధానికి ప్రతీకగా భావించే మంగళసూత్రం అమ్మి మరి టాయ్ లెట్ కట్టించుకుందన్న విషయం తెలిసిన ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. ఈ సాహసం చేసిన సంగీతను ప్రభుత్వం సన్మానించింది. మహారాష్ర్ట ప్రభుత్వ తరపున గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పంకజ్ ముండే సంగీత అహ్వాలను సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సంగీత, మరుగుదొడ్డి ప్రస్తుత తరుణంలో ప్రాధమిక అవసరం అన్నారు. ఇది లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణించలేమన్నారు. ఇక తనకు కేటాయించిన నిధుల్లో 25శాతం వరకు మరుగుదొడ్ల నిర్మాణంకు కేటాయిస్తానని మంత్రి పంకజ్ హామి ఇచ్చారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mangalsutra  toilet  latest news  maharasthra  

Other Articles