Who reassures on health impact of mobile phones

World Health Organisation. WHO, Mobile phone, Health risk, IARC, glioma, Mobile phone subscriptions

The WHO has again sought to reassure billions of mobile phone subscribers globally that no adverse effect has been found till date on an individual's health by its use.

రేడియేషన్ ముప్పు ఉత్తిదేనట..

Posted: 11/10/2014 11:00 PM IST
Who reassures on health impact of mobile phones

వాడికి పొద్దస్తమానం ఫోన్ వుంటే చాలు. అకలి నిద్ర కూడా అక్కర్లేదు అంటూ ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని మందలించేవారు. అ తరువాత.... ఎప్పడు ఫోన్ మాట్లాడితే.. దాని రేడియేషన్ తో  బ్రెయిన్ క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తాయట. ఫోన్ చేసామా, మాటాడామా, కట్టేసామా అన్నట్టుండాలి తప్ప.. గంటలకోద్ది ఫోన్ లొ మాట్లాడకూడదు అంటూ ఇంట్లో మొగవారు..ఆడవారిపై కసురుకునే సన్నివేశాలను ఇళ్లల్లోనూ, చిత్రాలు, సీరియల్ లలోనూ చూస్తున్నాం. అయితే ఇక మీదట మీరు ఎంతసేపైనా ఫోన్ లో హాయిగా ముచ్చట్లు ఆడోచ్చు.. ఎందుకంటారా..?

,మొబైల్ ఫోన్ల రేడియేషన్ వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి స్పష్టం చేసింది.  ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాల ప్రకారం.. సెల్‌ఫోన్ల నుంచి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలూ లభించలేదని డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ వస్తుందంటూ అనేక దేశాలలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భయాలను దూరం చేసేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా సెల్‌ఫోన్ల వాడటం వల్ల మనిషి శరీరంపై తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతున్నట్లుగా తమ అధ్యయనంలో వెల్లడికాలేదని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 690 కోట్ల మొబైల్‌ఫోన్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మొబైల్ రేడియేషన్ వల్ల శరీర కణజాలం వేడెక్కుతున్న మాట వాస్తవమేనని తెలిసింది. అయితే ఈ రేడియేషన్ వల్ల మెదడు, గుండె సహా ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు కలిగించేంత స్థాయిలో ఫ్రీక్వెన్సీలు ఉండవని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. మెదడు, గుండె పనితీరు, నిద్ర, బీపీ వంటివాటిపైనా ఎలాంటి దుష్ర్పభావాలు కలగడం లేదని స్పష్టం చేసింది. ఇంకేంటి హ్యాపీగా ఫోన్ మాట్లాడండి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles