Devendra fadnavis to seek trust vote today tripartite contest for maharashtra speaker post

BJP, Shiv sena, Maharastra, differnences, union cabinet expansion, Uddav thakery, PM, Narendramodi, Devendra fednavis, congress, NCP. manikRao Thakrey, speaker ekections, triangular fight

Devendra Fadnavis to seek trust vote today, Tripartite contest for Maharashtra Speaker post

బలనిరూపణకు సిద్దమైన ఫెడ్నవిస్ ప్రభుత్వం..

Posted: 11/12/2014 10:12 AM IST
Devendra fadnavis to seek trust vote today tripartite contest for maharashtra speaker post

మహారాష్ట్రలో నెలకొన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రభుత్వానికి ఇవాళే విషమ పరీక్ష. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం మనగలుగుతుందో.. లేదో లఃతేలనున్నది ఇవాళే. దీంతో మహారాష్ట్ర సహా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే మహారాష్ట్రలో అప్పడు మళ్లీ ఎన్నికలు రావడం ఇష్టలేదని, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎన్నికలను కోరుకోవడంలేదని భావిస్తున్న ఎన్సీపీ.. బీజేపి ప్రభుత్వం మనగలగడానికి కావాల్సిన బలాన్ని బయట నుంచి సమకూరుస్తామని చెప్పింది. దీంతో మహారాష్ట్రలో దేవేంద్ర ఫెడ్నావిస్ ప్రభుత్వానికి ఇబ్బంది లేదని స్పష్టమవుతోంది.

ఇవాళ మధ్యాహ్నం మహారాష్ట్ర స్పీకర్ ఎన్నిక తరువాత దేవెంద్ర ఫెడ్నవిస్ నేతృత్వంలోని బీజేపి ప్రభుత్వం బల నిరూపణ చేసుకునేందుకు సిద్దంగానే వుంది. బలనిరూపణ విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ ఏమాత్రం టెన్షన్ కు గురికావడం లేదు. శివసేన ప్రతిపక్షంలో కూర్చుంటామని తేల్చిచెప్పినా.. ఈ విషయంతో పెడ్నవిస్ లోని ఏ మాత్రం మార్పు కనబడలేదు. దీంతో ఆయన ఇప్పటికే తన ప్రణాళికను సిద్దం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేన మద్దతు లభించకపోయినా.. ప్రభుత్వం బలాన్ని ఎలా నిరూపించుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రణాళికను రచించారని, అందుకు అనుగూణంగానే ఆయన వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బలనిరూపణ విషయంలో ఇప్పటికే ఫెడ్నవిస్ అన్ని చర్యలను తీసుకున్నారని అంటున్నాయి బీజేపి వర్గాలు.

బీజేపీ, శివసేన మధ్య పాతికేళ్ల మైత్రిబంధం పూర్తిగా తెగదెంపులకు మహారాష్ట ఎన్నికలు కారణమవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరుగుతోంది. అసెంబ్లీ లో ప్రతిపక్షంలోనే కూర్చుని ప్రధాన ప్రతిపక్షంగా తమ సత్తాను చాటుతామని శివసేన తేల్చిచెప్పింది. అంతేకాదు బీజేపికి పోటీగా  శివసేన... కూడా అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు అభ్యర్థిని బరిలో నిలిపింది. మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ పదవికి కూడా నామినేషన్‌ దాఖలు చేసింది. ఆ పార్టీ తరఫున విజయ్‌ అవ్తీ నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ నుంచి హరిభావ్‌ బాగ్డే, కాంగ్రెస్‌ నుంచి వర్షా గైక్వాడ్‌ నామినేషన్లు వేశారు. స్పీకర్ పదవి కోసం ఎన్సీపీ పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామంటూ ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే- శివసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎన్సీపీ పోటీకి దిగకపోవడంతో కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దించింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ పదవికి ముక్కోణపు పోటీ నెలకొంది.

 ఫడణవీస్: సభాపతి ఎన్నిక ఏకగీవ్రమయ్యేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలకూ సీఎం ఫడణవీస్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సహా కాంగ్రెస్ నేతల్ని సీఎం కలిశారు. అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఇదే తొలిసారి అని అసెంబ్లీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనంత్‌ కల్సే చెప్పారు. ఇవాళ రహస్య బ్యాలెట్‌ ద్వారా స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. కాగా, పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ ఉదయానికి సభ హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం.

మరోవైపు బలపరీక్ష: నేపథ్యంలో కాంగ్రెస్ తప్పిస్తే ఏ పార్టీ నుంచైనా మద్దతు తీసుకుంటామని బీజేపి ప్రకటించింది. శివసేనతో పొత్తు కుదరకపోయినప్పటికీ ఎన్సీపీ మద్దతులో సభా విశ్వాసాన్ని బీజేపి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేదీ లేనిదీ శివసేన ప్రకటించాల్సి ఉంది. శివసేనకు 63 మంది, కాంగ్రెస్‌కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కలిసినా ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి లేకపోవడంతో ఫెడ్నవిస్ ప్రభుత్వం ధీమాగా వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles