మహారాష్ట్రలో కొలవుదీరిన కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై గత కొన్నాళ్లుగా నెలకోన్న ఉత్కంఠకు తొలగిపోయింది. ముందునుంచి అచితూచి అడుగువేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నవిస్.. అన్ని తాను అనుకునట్టే ప్రణాళికా బద్దంగా ముగించారు. దేశ ప్రజల ఉత్కంఠతతో పాటు ప్రతిపక్షాల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆయన ఇవాళ నిండు కోలువులో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో బీజేపి ప్రభుత్వం సభా సభ్యుల విశ్యాసాన్ని పొందింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన బలనిరూపణ పరీక్షలో దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గిందని స్పీకర్ హరిబాబు బాగ్దే ప్రకటించారు.
మహారాష్ట్రలో బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకోవాలని చివరి వరకు యత్నించి.. చివరకు ప్రతిపక్షంలో కూర్చున్న శివసేన ఫెడ్నవిస్ ప్రభుత్వానికి రోజుకో విధంగా వ్యవహరించింది. తమ డిమాండ్లు, కండీషన్లకు బీజేపి ప్రభుత్వం లొంగకపోయే సరికి చివరకు పాతికేళ్ల మైత్రిబంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. మొత్తం 288 మంది సభ్యులన్న మహారాష్ట అసెంబ్లీలో బీజేపి పక్షాన 122 మంది సభ్యులు వుండగా, 41 మంది ఎన్సీపీ సభ్యులు కూడా మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం సునాయాసంగా బలాన్ని నిరూపించుకుంది. మహారాష్ట్రలో మళ్లీ అప్పుడే ఎన్నికలు రావడం ఇష్టం లేక, రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల సంక్షేమం కోసం బీజేపికి మద్దతునిస్తామని ముందునుంచి చెబుతున్న ఎన్సీపీ అనుకున్నట్లుగానే బీజేపికి మద్దతు తెలపడంతో పెడ్నవిస్ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందగలిగింది.
63 మంది సభ్యులున్న శివసేన, 42 మంది సభ్యులున్న కాంగ్రెస్.. ఇద్దరు కలిసినా.. బీజేపికి ఎలాంటి ఢోకా లేకపోవడంతో.. బీజేపి వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అయితే విడిగా ఓటింగ్ నిర్వహించాలని, మొత్తం సభ్యుల నుంచి ఓటింగ్ తీసుకోవాలని, విడివిడిగా లెక్కించాలంటూ శివసేన పట్టుబట్టింది. డివిజన్ చేయాల్సిందేనని భీష్మించుకుంది. అందుకు స్పీకర్ హరిభావు బాగ్డే నిరాకరించారు. దాంతో శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. దాంతో మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ సర్కారు సులభంగా గట్టెక్కేసింది.
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా ముగిసింది. ఓటింగ్ కు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి హరిభావు బాగ్డే ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఔరంగాబాద్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరిభావు బాగ్దేను స్పీకర్ పదవి వరించింది. స్పీకర్ ఎన్నికకు తొలుత శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ స్పీకర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, తర్వాత ఇరుపార్టీలూ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో స్పీకర్ పదవిని కూడా బీజేపి గెలుచుకుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more