Modi meets pro democracy icon aung san suu kyi

Prime Minister, Narendra Modi, ASEAN, EAST Asia summit, pro-democracy icon, Aung San Suu Kyi

Modi meets pro-democracy icon Aung San Suu Kyi

ప్రజాస్వామ్య ఉద్యమకారిణి సూకీతో ప్రధాని మోడీ భేటీ

Posted: 11/12/2014 10:59 PM IST
Modi meets pro democracy icon aung san suu kyi

మయన్మార్‌లో ఏసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట యోదురాలు, ప్రతిపక్ష నేత, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీతో ఇవాళ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగ్ సాన్ సూకీ ప్రధానమంత్రి మోడీ తనను కలసినందుకు సంతోషంగా వుందని అన్నారు. తనకు భారత్ రెండో నివాసమని సూకీ ఈ సందర్బంగా పేర్కోన్నారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అదినేత్రి సూకీ ప్రధానిని కలవాలని ఆయనకు ఫోన్ చేశారు. అమె అభ్యర్థనను మన్నించిన మోడీ అమెకు అపాయింట్ మెంట్ ఇచ్చారు.

నాయ్ పై తావ్ లోని పార్క్ రాయల్ హోటల్ లోని ప్రెసిడెన్సిషల్ సూట్ రూమ్ ఈ ఇద్దరు నేతల భేటీకి వేదికైంది. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై ముచ్చటించారు. మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల పాటు పోరాటాం చేస్తున్న సూకీకి భారత దేశ ప్రజాస్వామ్యం విధానమే ప్రేరణ కల్పించింది. భారత దేశ రాజధాని ఢిల్లీలోనే తాను విద్యాబాస్యం,  కాలేజ్ చదువులు పూర్తి చేశారు. చివరి సారిగా 2012లో అంగ్ సాన్ సూకీ భారత్ లో పర్యటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister  Narendra Modi  ASEAN  EAST Asia summit  pro-democracy icon  Aung San Suu Kyi  

Other Articles