Salman khan sister arpita past life history hyderabad falaknuma palace marriage

salman khan, salman khan sister, salman khan arpita marriage, arpita marriage news, salman khan shahrukh khan news, hyderabad falaknuma palace, salman khan sister arpita marriage, shahrukh khan arpita marriage

salman khan sister arpita past life history hyderabad falaknuma palace marriage

సల్మాన్ సోదరి అసలు రహస్యం.. అర్పిత సొంత చెల్లెలు కాదట!

Posted: 11/18/2014 08:39 PM IST
Salman khan sister arpita past life history hyderabad falaknuma palace marriage

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అయిన అర్పితఖాన్ వివాహ వేడుకలు మంగళవారం హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే! ఈ వివాహవేడుకలకు ఎంతోమంది వ్యాపారదిగ్గజాలు, సినీప్రముఖులందరూ పాల్గొన్నారు. ఇక నిన్నమొన్నటివరకు కస్సుబుస్సులాడుకున్న షారుఖ్, సల్మాన్ లు ఈ వేడుకల సందర్భంగా కలుసుకుని, సందడి చేశారు. అంతాబాగానే వుంది కానీ... ఈ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన విషయం వుంది. అదేమిటంటే.. అర్పిత అసలు సల్మాన్ ఖాన్ సోదరియే కాదు. కొన్ని విషాదకరమైన పరిస్థితుల్లో గడుపుతున్న నేపథ్యంలో దేవుడు కరుణించడంతో సల్మాన్ కుటుంబంలో చేరిపోయింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

అర్పిత చిన్నపిల్లగా వున్న కాలంలో ఆమె తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. తల్లి మరణించిన దు:ఖంలో మునిగిపోయిన అర్పిత, ఒకనాడు రోడ్డుపై దీనంగా కనిపించింది. ఆ అమ్మాయిని అటువంటి పరిస్థితుల్లో చూసిన సల్మాన్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సలీంఖాన్ చలించిపోయారు. మరేమీ ఆలోచించకుండా ఆమెను ఇంటికి తీసుకువచ్చి దత్తత చేసుకున్నారు. ఎంతో ముద్దుగా వున్న అర్పితను కన్నబిడ్డకంటే ఎక్కువ మిన్నగా చూసుకున్నారు సలీంఖాన్ దంపతులు. అలాగే వాళ్ల కుమారులు సల్మాన్, అర్బాజ్, సోహేల్ ఖాన్ లు కూడా అర్పితపై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నారు. ఆ అమ్మాయి కోరిన అన్ని కోరికలను తీర్చడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు సల్మాన్ సోదరులు. అందుకు ప్రస్తుతం జరిగిన వివాహ వేడుకలే ఉదాహరణగా తీసుకోవచ్చు.

తన మనసుకు నచ్చినవాడితో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించడం చూస్తుంటే అర్పితపై వారికెంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతున్న పెళ్లి వేడుక ఖర్చు రూ.2 కోట్లు కాగా, బంగారు చెల్లికి సల్మాన్ ముంబయి కార్టర్ రోడ్డులో రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ బహుమతిగా కూడా ఇచ్చాడు. అర్పిత అదృష్టం అనడం కంటే, ఇదంతా సల్మాన్ కుటుంబం గొప్పదనంగానే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  arpita khan  shahrukh khan  hyderabad falaknuma palace  telugu news  

Other Articles