భారత్ చేపట్టిన 'మంగళ్‌యాన్'ను 2014 సంవత్సరపు అత్యుత్తమ ఆవిష్కరణగా 'టైమ్' పత్రిక అభివర్ణించింది. సాంకేతిక అద్భుతంగా పేర్కొంది. అంతేకాదు అది సూపర్ స్మార్ట్ స్పేస్ క్రాప్ట్ అంటూ కోనియాడింది'' తొలి యత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం అనేది అనితర సాధ్యమైన విషయమని.. ఇప్పటి వరకు తొలి ప్రయోగంలోనే విజయం సాధించిన తొలి దేశం భారతేనని పేర్కొంది. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు, చైనా ఎవర్వకీ సాధ్యం కాని ప్రయోగాన్ని తొలిసారిలోనే భారత్ సాధించడం హర్షనీయమని పేర్కొంది.
సెప్టెంబరు 24న భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు ధీనిని సుసాధ్యం చేశారని కోనియాడింది. ఇప్పటిదాకా ఏ ఆసియా దేశం కూడా సాధించని అద్భుతాన్ని భారత సాధించిందని' టైమ్ పేర్కొంది. 2014 సాధించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళయాన్ ఒకటని పునరుద్ఘాటించింది. మరోవైపు 'టైమ్' అత్యుత్తమ అవిష్కరణల్లో మరో ఇద్దరు భారతీయుల అద్బుతావిష్కరణలకు చోటు దక్కింది. కాలేజ్ ఫ్రోఫెసర్, అటవీ పర్యావరణ శాస్త్రవేత్త నళిని నందకర్ణీ అవిష్కరించిన బ్లూ రూమ్ తో పాటు ప్రమోద్ శర్మ చిన్న పిల్లలకు కోసం అవిష్కరించిన ఓస్మోలు కూడా టైమ్ అత్యుత్తమ అవిష్కరణల్లో చోటు దక్కించుకున్నాయి.
పలు నేరాలకు పాల్పడి, జైళ్లలో మగ్గుతున్న నేరగాళ్లు 24 గంటల పాటు కేవలం తెల్లగదులను చూస్తూ గడుపుతున్నారని, దీని వల్ల వారు మానసికంగా క్షీణించి.. మనోవేధనకు లోనై.. ఆత్మహత్యల దిశగా ఆలోచనలు వెళ్తున్నాయని.. వారి కోసం బ్లూ రూమ్ అనే అవిష్కరణను చేశారు. ఖైదీలు వున్న సెల్‌లోనే ఆహ్లాదకర వాతావరణం మధ్య ఉన్నట్లనిపించే అవిష్కరణ పేరే 'బ్లూ రూమ్'(నీలివర్ణపు గది) దీంతో వారి గదిలో సుందర జలపాతాలు, అడవులు, తదితర చిత్రాలను ఓ కెమెరాతో నడిపిస్తుంటారు. దీని ద్వారా ఖైదీలకు తాము పార్కులో వున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. అటు పిల్లలను మైమరపింపచేసే 'ఓస్మో' అనే ట్యాబ్లెట్ బొమ్మను తయారు చేసిన ప్రమోద్‌శర్మల ఆవిష్కరణలనూ 'టైమ్' ప్రశంసించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more