టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసుపై పునర్విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ర్టంలో సంచలనం రేపిన ఈ హత్య కేసును తిరిగి విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నాము అని ఏపీ హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో సోమవారం పర్యటించిన రాజప్ప, పరిటాల ఘాట్ లో నివాళులు అర్పించారు. కేబినెట్ లో చర్చించి ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసకుంటామన్నారు. కేవలం రవి ఎదుగుదలను చూసి ఓర్వలేని శక్తులు హత్య చేయించాయని ఆరోపించారు.
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మొద్దుశ్రీను జైలు జీవితం అనుభవిస్తూ ఓ ఖైదీ దాడిలో మృతి చెందారు. ఇక శ్రీను వెనక ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కున్న మద్దెల చెరువు సూరి భాను ప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. మిగతావారి విషయానికి వస్తే.., హత్యపై ఆరోపణలు ఎదుర్కుంటున్న కొందరు నేతలు ప్రస్తుతం అధికార పార్టీలోనే ప్రజా ప్రతినిదులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ విచారణ జరిగితే వారి పేర్లు బయటకు వచ్చి టీడీపీ తన గోతిని తానే తవ్వకుంటున్నట్లు అవుతుంది.
పునర్విచారణ జరిగినా.., ఆరోపణలు వచ్చిన వారికి క్లీన్ చిట్ ఇస్తే మాత్రం రవి వర్గం నుంచి టీడీపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోనుంది. ఈ కేసు పునర్విచారణ అనేది ప్రారంభం అయితే టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతుంది. మరి విచారణ పేరుతో తుట్టెను కదిపిన చినరాజప్ప ఎంతవరకు మాటపై నిలబడతాడు.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. అనంతపురంతో పాటు ఉమ్మడి రాష్ర్టంలో టీడీపీ ముఖ్య నేతగా ప్రజల్లో మంచి పట్టున్న పరిటాల రవి దుండగుల చేతిలో 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more